లక్ష్మిదేవి ఇంట్లోకి అడుగుపెట్టాలంటే ఇలా చేసి చూడండి..!

Divya
హిందూ పురాణాల ప్రకారం,హిందూ మతంలో మొదటగా వచ్చే నెల పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఇవ్వబడుతుంది.చాలామంది ఇళ్లలో తొలిమాస పౌర్ణమిని ప్రత్యేకంగా పండగలా చేసుకుంటారు.
సాధారణంగా పౌర్ణమి రోజుకి పవిత్రమైన ప్రాముఖ్యత ఉంది.ఈ రోజున కొందరు జీవితంలో సుఖసంతోషాలు, ఆర్థిక ప్రగతి కోసం సంవత్సరంలో వచ్చే తొలి మాస పౌర్ణమి రోజున ఉపవాస దీక్షలు చేస్తుంటారు.ఉంటారు.జ్యేష్ఠ పౌర్ణమి రోజును విష్ణువు,శివునికి ప్రత్యేక పూజలు,దానం, ధ్యానం,మరియు స్నానం చేయటానికి ప్రాముఖ్యతను ఇస్తారు.
 
పౌర్ణమి రోజున పుణ్యనదులలో,చెరువులలో,పారె నీటిలో ఎక్కడైనా స్నానం ఆచరించడం, ఉపవాస దీక్షలు చేయడం, దానధర్మాలు ఇవ్వడం వంటివి చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.అలాంటి రోజున మనం చేసే పూజలతో పాటు కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల విశేష లాభాలు కలుగుతాయి.
సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు.ఆ రోజుకి  ఆధిపతి జ్యేష్ఠదేవి.ఆమె ఇంట్లోకి అవహించడం వల్ల ఇంట్లోని వారు ఆర్థిక,మానసిక వంటి రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అలాంటి రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా,జ్యేష్ఠదేవి వెళ్ళిపోయి,లక్ష్మిదేవి అవహిస్తుంది.మరియు ఇంట్లోని సమస్యలను పోగొట్టి అపారమైన సంపదలను కురిపిస్తుంది.లక్ష్మీదేవిని భక్తి శ్రద్దలతో కొలవడం వల్ల,ఆమె అనుగ్రహం ఎప్పటికీ మనతోనే నిలిచి ఉంటుందని వేద పండితులు చెబుతారు.
ఈ రోజున కొన్ని వస్తువులు చంద్రుని ప్రతిగా దానం చేయాలి.ముఖ్యంగా వెండి,పసుపు రంగులో వున్న పండ్లు,తెలుపు రంగు పూలు,అన్నం,పంచదార, పెరుగు, తెలుపు రంగులో ఉన్న ముత్యాలు మొదలైన వాటిని అవసరమైన వారికి దానం చేయడంతో మనకు ప్రయోజనాలను చేకూరస్తుంది.
ఎవరైనా వ్యాపారంలో కానీ,ఉద్యోగంలో కానీ వచ్చిన సమస్యల నుంచి గట్టేక్కాలి అంటే బాగా ఊడలు దిగిన మర్రిచెట్టు దగ్గర పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే,వారి సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
ఆ రోజున రాత్రిపూట ఇంటి ముఖద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి.ఇలా చేయడంతో లక్ష్మీదేవి ఇంట్లోకి అవహిస్తుందని చెబుతారు.దానితో ఆ ఇంట్లోని వారు సుఖశాంతులతో,ఐశ్వర్యంతో తులతుగుతారాని వేద పండితులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: