లేవగానే వీటిని చూస్తే దరిద్రమే నా..?

Divya
మనలో చాలామంది కొన్ని విషయాలను సెంటిమెంటల్ గా నమ్ముతుంటారు.ముఖ్యంగా ఉదయాన్నే కుడిపక్కనే లేవాలని అప్పుడే చాలా మంచి జరుగుతుందని, ఎడమ పక్క లేస్తే ఏదో ఒకటి కీడు జరగబోతుందని శంకిస్తూ ఉంటారు.ఇలాంటివి మూఢనమ్మకాలు అనే కొంతమంది భావించినా కానీ కొన్ని విషయాలు కచ్చితంగా నమ్మాల్సిందేనని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తూన్నారు.ఉదయం లేవగానే కొన్ని వస్తువులను చూడడం వల్ల మనలో నెగటివ్ ఎనర్జీ మొదలై, ఏ పనులు పట్టుకున్న జరగకుండాఉంటాయి.దానితో ఆర్థిక సమస్యలు,ఇంట్లో గొడవలు మొదలవడం, వంటివి జరుగుతూ ఉంటాయి అందువలన వస్తువులను ఉదయం లేవగానే అస్సలు చూడకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆ వస్తువులు ఏంటి ఇప్పుడు తెలుసుకుందామా..
కొంతమందికి నిద్ర లేవగానే అన్నింటి కన్నా ముందు అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు.కానీ అద్దంలో నిద్ర లేవగానే అస్సలు ముఖం చూసుకోకూడదని,అది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.అలా చేస్తే వారి జీవితంలో దురదృష్టాన్ని వచ్చేలా చేస్తుందని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. మరియు ఉదయం లేవగానే వంటగదిలోకి పోగానే రాత్రి తిన్న ఎంగిలి పాత్రలను అస్సలు చూడడం మంచిది కాదని సూచిస్తూన్నారు.అటువంటి వస్తువులు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఉండడం వల్ల,లక్ష్మిదేవి ఇంటి నుంచి వెళ్ళిపోయి,దరిద్ర దేవతను ఆహ్వానిచ్చినట్టే. కావున ఎప్పుడు తిన్న వస్తువులు అప్పుడే శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
ఇంటి గృహిణి ఉదయం లేవగానే జుట్టు విరబోసుకొని ఎవరికీ కనపడకూడదు.దీని వల్ల ఆ ఇంట్లోని వారు అనుకున్న పనులు సజావుగా జరగవని పెద్దలు మందలిస్తుంటారు కూడా.కావున ఇంటి గృహిణి ఎంత శుభ్రంగా,నిర్మలంగా కనిపిస్తుందో,ఆ ఇల్లు లక్ష్మిదేవి ఇంట్లోకి వచ్చి, కళకళలాడుతుంది.
ఇంట్లో హింసాత్మాకమైన ఫోటోలు,బాధాకరంమైన అర్థం వచ్చేట్టు ఉండే ఫోటోలు,విరిగిపోయిన అద్దాలు,విరిగిన ప్లవర్ వాజ్ లు వంటివి ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు.వాటి వల్ల నెగటివ్ ఆలోచనలు పెరిగిపోయి,ఇంట్లోని వారికి ఆర్థిక, మానసిక సమస్యలు మొదలవుతాయి.కావున అలాంటి వస్తువులు ఇంట్లో ఏమైనా ఉంటే పడేయడం మంచిది.ఇలాంటి వస్తువులు ఉదయం లేవగానే అస్సలు చూడకూడదుl

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: