హిందువులు నమ్మే మూఢనమ్మకాలు ఎంటో తెలుసా..?

Divya
హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని ఆచారాలను ఇప్పటికి కొనసాగిస్తున్నాము. కానీ ఇందులో మధ్యలో పుట్టించిన ఆచారాలు కొన్ని మూఢనమ్మకాలను తలపిస్తున్నాయి.ఆ నమ్మకాలను ఇప్పటికీ నిజమని భావిస్తూ,ఆచరిస్తున్నాము.హిందూ సాంప్రదాయాలు కేవలం దేవుడుపై నమ్మకమే కాక, సైన్స్ ని కూడా మేళవించి ఉంటాయి. కావున ఏవి మూఢనమ్మకాలో, ఏవి సాంప్రదాయాలో తెలుసుకొని పాటించడం ముఖ్యమని పండితులు చెబుతున్నారు. అలాంటి మూఢనమ్మకాలు ఎంటో ఇప్పుడు చూద్దాం..
1.ఆడవారు మాత్రమే పూజ చేయడం :
చాలామంది ఇళ్లల్లో పూజ కేవలం ఆడవారికి మాత్రమే చెందినదని,వారు చేస్తేనే మోక్షం కలుగుతుందని భావిస్తుటారు. కానీ మన సంప్రదాయం ప్రకారం  మగవాళ్లు ఉదయాన్నే పూజ చేయడంతో సిరిసంపదలు కలుగుతాయని పేర్కుంటోంది.
2.సీత అని పేరు పెట్టకపోవడం:
ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు సీత అని పేరు పెట్టుకోవడం వల్ల,రామాయణంలో సీత కలిగిన బాధలే పిల్లలకు కలుగుతాయని భావిస్తుంటారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని, సీత, లక్ష్మీ అని పలు దేవతల పేర్లు పెట్టి పిలుచుకోవడం వల్ల,వారి అనుగ్రహం మనపై కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
3. లాఫీంగ్ బుద్ధని ఇంట్లో పెట్టుకోవడం..
లాఫీంగ్ బుద్ధని ఇంట్లో పెట్టుకోవడం వల్ల,ఇంట్లోకి ధనప్రవాహం కలుగుతుందని,వ్యాపా ర వాణిజ్యాలు పెరుగుతాయని భావించి పెట్టుకుంటుంటారు. కానీ ఇది నిజం కాదని,అస్సలు అది హిందూ ధర్మంలో లేదని వేద పండితులు చెబుతున్నారు.
4. మగపిల్లలకు బొట్టు  పెట్టకపోవడం..
మగపిల్లలకు బొట్టు పెడితే వారి శౌర్యం తగ్గుతుందని భావించి, వారికి బొట్టుపెట్టరు.ఒకవేళ ఎవరైనా పెట్టుకున్నా వారిని హేళన చేస్తుంటారు. కానీ పూర్వం  ప్రతి రాజుకు వారి తల్లులు కానీ, భార్యలు కానీ వీర తిలకం దిద్దించి మరీ , యుద్దాలకు పంపేవారని  పురాణాలు చెబుతున్నాయి.
5.ఇంట్లో నిల్చున్న లక్ష్మీదేవీ ఫోటో పెట్టకపోవడం..
ఇంట్లో నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో పెట్టడం వల్ల, ఇంట్లోనే సిరిసంపదలు బయటికి వెళ్లిపోతాయని భావిస్తుంటారు.ఇందులో ఏ మాత్రం నిజం లేదని,లక్ష్మీదేవి మనసారా పూజిస్తే కరుణిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: