ప్రపంచంలో అన్ని శక్తులు ఉంటాయి. ఏదీ లేదు అని మనం తీసివేయలేం. ఒక మనిషిని మనం కూర్చొని ఆకర్షిస్తూ ఉన్నామంటే కచ్చితంగా అతనిలో వశీకరణ శక్తి ఉంది అని అర్థం. మనం సినిమాలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం మేము వీరికి ఫ్యాన్, వారికి ఫ్యాన్ అని చెబుతూ ఉంటారు. మరి అతను మనకు నచ్చడానికి ప్రధాన కారణం అతనిలో ఏదో శక్తి ఉంది దాన్ని వశీకరణం అంటారు. ఎప్పుడైతే మన శత్రువులను మనం ఆకర్షిస్తామొ దాన్ని కూడా వశీకరణం అంటారు. పూర్వం లో రుషులు, మహర్షులు, ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఉండే వారు. ఆ సమయంలో వన్యమృగాలు అనేవి ఎక్కువగా ఉండేవి.
ఈ మృగాళ్లు దాడి చేయకుండా వీరు కొన్ని వశీకరణ శక్తులను ఉపయోగించి శబ్దాలను, చెట్లను మూలికలను పెంచి వశీకరణ విద్యలు నేర్చుకొని ఆ మృగాలను దాడి చేయకుండా వశీకరణ శక్తితో కంట్రోల్ చేస్తూ ఉండేవారు. సైకాలజీ ప్రకారం ఏం వ్యక్తి అయినా మనం మోటివేట్ చేయొచ్చు అని సైకాలజిస్టు చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి కళ్లలో ఏదో తెలియని శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి వశీకరణ శక్తినే చెక్చూరు విద్యతో జంతువులను కూడా వశీకరణ చేయొచ్చు. దీన్ని పక్కన పెడితే ఏదైనా కొన్ని మూలికలను తెచ్చి మనం చెప్పిన మాటలు వినని వారికి తినే ఆహారంలో కానీ, తాగే నీటిలో కానీ కలిపి ఇస్తే వశీకరణం అనేది జరుగుతుంది. ఇందులో వశీకరణ అనేది వేరుగా ఉంటుంది, అలాగే ఆకర్షణ కూడా మరోలా ఉంటుంది. మనం ఎవరికైనా ఆకర్షితులం అవుతాం. ఎలా అంటే వారిలో వశీకరణ చేసే శక్తి ఉంది కాబట్టి ఆకర్షితులం అవుతాం. వశీకరణ శక్తి అనేది స్వాభావిక శక్తి. ఇంకా ముందుకు వెళితే గుప్త విద్యతో అంటే మంత్ర విద్యతో వశీకరణ చేస్తారు. పూర్వకాలంలో దేవత వశీకరణ అనేది ఉండేది. తర్వాత జనాకర్షణ, జన వశీకరణ విద్య ఆకర్షణ, విద్య వశీకరణం, ఏదైనా కష్టపడి అనుకోని ప్రయోగం చేస్తేనే వశీకరణం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువగా పూర్వకాలంలోనే ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఈ వశీకరణ చేసే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. పురుషులు స్త్రీలు ఎలా ఉంటారో, మూలికల్లో కూడా స్త్రీలను మరియు పురుషులను సపరేట్గా వశీకరణ చేసే మూలికలు ఉంటాయి. వశీకరణ అనేది మనం ఉండే ప్రదేశానికి మంచి చేస్తుందంటే మాత్రమే చేయాలి. అలా కాకుండా ఎవరికో ఏదో చెడు చేయాలని వశీకరణ చేస్తే మాత్రం అది చేసిన వారికే పాపంగా చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు. మనకు ఎవరైనా వశీకరణ చేస్తే మాత్రం మన మెదడు నాలుగు విధాలుగా ఆలోచించదు. ఒకే విధంగా ఆలోచిస్తుంది. చేసిన వారిపై కోపం రాదు. అతను చెడు చేస్తున్నా మనకు మంచిగానే కనపడుతుంది. వేరే వ్యక్తులు చెడు అని చెప్పినా కూడా మనకు మంచిగానే అనిపిస్తుంది. అది స్ట్రీలే కావచ్చు పురుషులే కావచ్చు. వశీకరణం చెందినవారు రాత్రిపూట నిద్రపోరు.
పగలు మొత్తం నిద్రపోతూ ఉంటారు. రాత్రిపూట ఎంత మంచి భోజనం తిన్న ఉదయం లేచేసరికి శక్తి లేకుండా తయారవుతారు. చాలా మంకు తనం ఉంటుంది. వశీకరణం అయిన వారికి ముఖంలో దైవ లక్షణం ఉండదు. ఫ్రెత లక్షణం ఉంటుంది. ముఖంలో తేజస్సు పడిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనబడితే మీకు వశీకరణం జరిగినట్టే అని గ్రహించాలని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు. (ముఖ్యంగా వశీకరణం అనేది మంత్ర, తంత్రం
అయితే కాదు. ఇందులో కూడా సైన్స్ ఉంటుందని మనం గ్రహించాలి. వశీకరణం పేరుతో భయాందోళనలకు గురి చేసే వారిని అస్సలు నమ్మొద్దు. )