మన భారతదేశంలో ఇప్పటికీ మనం ఏ శుభకార్యం చేసుకున్నా, ఇల్లు కట్టుకున్న, వాహనం కొనుక్కున్నా, సమయము మంచిదేనా కాదా అని చూస్తూ ఉంటాం. ఇప్పటికీ జాతకాన్ని పెళ్లికి ముందు చూసి మన పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. మరి అలాంటివి జాతక రేఖలు మన చేతిలో ఉంటాయా.. మరి మన చేతిలో ధన రేఖ ఏ విధంగా ఉంటే మనం కోటీశ్వరులము అవుతామో తెలుసుకుందామా..! ఎవరికైనా సరే చేతిలో ధన రేఖ ఇలా ఉంటే దాన్ని బట్టి మనకు డబ్బు ధాన్యం అనేది వస్తూ ఉంటుంది. జీవితంలో తొందరగా స్థిరపడాలంటే, కోటీశ్వరులు అవ్వాలి అంటే మన చేతిలో ధన రేఖ అనేది ప్రత్యేకమైన విధివిధానాలు కలిగి ఉండాలి. రేఖలను పురుషులకైతే కుడి చేయి, స్త్రీలకు అయితే ఎడమ చేయి చూసుకోవాలి.
సహజంగా ఈ ధనరేఖ అనేది మణికట్టు నుంచి మొదలై మన మధ్య వేలు వారికి వస్తే దాన్ని పూర్తి ధనరేఖ అంటారు. మీలో ఎవరికైనా అలా ఉంటే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. కానీ కొంతమందికి ధన రేఖ అనేది మణికట్టు నుంచి ప్రారంభం కాదు. మధ్యలో నుంచి ప్రారంభమవుతుంది. మధ్యలో నుంచి ప్రారంభమై మధ్య వేలు వరకు వెళుతుంది. అలాంటి వాళ్లు జీవితంలో మొదట్లో డబ్బులు లేకపోయినా మిడిల్ ఏజ్ వచ్చేసరికి డబ్బులు సంపాదించడం మొదలవుతుంది. తర్వాత వాళ్లు కోటీశ్వరులవుతారు. ఇంకొంతమందికి ఏంటంటే అరచేతిలో ముఖ్యంగా మూడు రేఖలు ఉంటాయి. ఒకటి ఆయుష్షు రేఖ, ఒకటి బుద్ధి రేఖ, ఆత్మ రేఖ అంటారు. చూపుడు వేలు నుంచి ప్రారంభమై చిటికెన వేలు వరకు వెళుతుంది. వీరికి 35 సంవత్సరాల వరకు డబ్బు నిలవదు. ఆ తర్వాతే ధన ప్రవాహం వస్తుంది. మరో రేఖ ఆత్మరేఖ. ఇది చూపుడు వేలు నుంచి ప్రారంభమై చిటికెన వేలు వరకు వెళుతుంది. ఈ రేఖ ద్వారా వీరు ఎంత డబ్బు సంపాదించినా వీరి కంటే ఎక్కువ బయట వాళ్లే లబ్ధి పొందుతారు. ఈ ఆత్మ రేఖ, ధన రేఖను తాకితే ఒక విధంగా ప్రయోజనం ఉంటుంది. ఆత్మ రేఖ కాకుండా బుద్ధిరేఖను తాకితే ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది. అయితే ఎవరికైనా సరే అరచేతిలో మణికట్టు నుంచి మధ్య వేలుకు వైపు వెళ్లె ధన రేఖ లో కన్ను ఆకారం
కనిపిస్తే వ్యక్తుల్ని నమ్మి డబ్బు మోసపోయో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా సరే అరచేతిలో కన్ను రాకూడదు. అలాగే అర చేతిలో ఇన్ టు గుర్తు వచ్చిన నష్టమనేది తీవ్రంగా జరుగుతుంది. ముఖ్యంగా అరచేతి మధ్యలో స్క్వేర్ గుర్తు వస్తే మాత్రం చాలా మంచిది. అలాగే అర చేతిలో చతురస్రాకార గుర్తు ఉన్నట్లయితే, డబ్బులు పోగొట్టే యోగం ఉన్న పోగొట్టుకో లేక పోతారు. ఒకవేళ డబ్బులు పోయినా మళ్ళీ తిరిగి వస్తాయి. కాబట్టి ధన రేఖ బట్టే మన భవిష్యత్తు అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొంతమంది చేతిలో ధన రేఖ అనేది ఉండదు. అయినప్పటికీ వారి దగ్గర చాలా డబ్బు ఉంటుంది. ధన రేఖ లేకుండా డబ్బులు ఎలా ఉంటాయంటే పూర్వీకుల ద్వారా డబ్బులు ఉంటాయి.