వివిఐపిలతో కిటకిట లాడుతున్న తిరుమల


కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల గిరులు భక్తులతో కిటకిట లాడుకున్నాయి. ఒక వైపు మంచు కురుస్తున్నా, భక్తుల గోవింద నామస్మరణలతో  తిరుమల క్షేత్రం వర్ణించలేనంత వైభవంగా ఉంది.  మరికొద్ది గంటల్లో తిరమలేశుుడు వైకుంఠ ద్వారం నుంచి భక్కులకు దర్శనమివ్వనుండటంతో భారీగా  కాకున్నా, పెద్ద సంఖ్యలోనే  భక్తులు విచ్చేశారు. చాలా ప్రముఖులు కూడా తిరమలలో స్వామి వారి దర్శనార్థం ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాస మహా ప్రభువుకు ధనుర్మాస కైంకర్యాలు జరుగుతున్నాయి. స్వామివారికి వేకువ ఝాము పూజాధికారు పూర్తి చేసి  భక్తులకు దర్శనం కల్పించేలే తిరుమల తిరుపతి దేవస్థాం  ఏర్పాట్లు చేసింది.
       తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, స్వాగతం పలికారు.  పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి కి వీరు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తో పాటు పలువురు న్యాయమూర్తులు కూడా భారత ప్రధాన న్యాయమూర్తి కి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అదే విధంగా  కర్ణాటక హై కోర్టు ప్రధాన  న్యాయమూర్తి  జస్టిస్ రితు రాజ్  అవస్థి ని టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి  మర్యాద పూర్వకంగా కలిశారు శ్రీ కృష్ణ అతిథి గృహంలో  ప్రధాన న్యాయమూర్తిని కలిసి శాలువ, పుష్పగుచ్ఛం అందించి సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.


ప‌ది రోజుల్లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు : న‌మామి గోవింద బ్రాండ్ పేరుతో ప‌ది రోజుల్లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. స‌నాత‌న హిందూ ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా గోమాత ప్రాశ‌స్త్యాన్ని భ‌క్తుల‌కు తెలియ‌జేసేందుకు పంచ‌గ‌వ్యాల‌తో ప‌లుర‌కాల గృహావ‌స‌ర ఉత్ప‌త్తులు త‌యారు చేస్తున్న‌ట్టు ఈవో తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: