క్రిస్మస్ స్పెషల్ : 'హ్యాపీ క్రిస్మస్' కాకుండా 'మెర్రీ క్రిస్మస్' అని ఎందుకు ?
క్రైస్తవులకు క్రిస్మస్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ పండుగను ఏసు ప్రభువు పుట్టిన సందర్భంగా జరుపుకుంటారు. క్రిస్టమస్ పండుగను క్రైస్తవుల్లోనే కాకుండా అన్ని మతాల వారు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగ అనేది 1 రోజు కాకుండా పూర్తి 12 రోజుల పండుగ అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ పండుగ క్రిస్మస్ సందర్భంగా ప్రారంభమవుతుంది. క్రిస్మస్ ఈవ్, మతపరమైన సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఈ సంప్రదాయాల ప్రధాన ఉద్దేశం యేసు ప్రభువు జననం. ఈ రోజున రోమన్ కాథలిక్కులు, ఆంగ్లికన్లు అర్ధరాత్రి పండుగను నిర్వహిస్తారు. లూథరన్లు క్యాండిల్ లైట్ సర్వీస్, క్రిస్మస్ పాటలతో జరుపుకుంటారు. అనేక ఎవాంజెలికల్ చర్చిలు సాయంత్రం పండగను నిర్వహిస్తాయి.
అయితే కొంతమంది 'హ్యాపీ క్రిస్మస్' అని కాకుండా 'మెర్రీ క్రిస్మస్' అని ఎందుకు అంటారు ? అనే విషయం తెలుసా ? 'మెర్రీ క్రిస్మస్' అనడం కొన్ని వందల ఏళ్ల ఆచారం. 1534లో (1500లలో ఆంగ్ల కాథలిక్ మత బిషప్) థామస్ క్రోమ్‌వెల్‌కు క్రిస్మస్ లేఖలో దీనిని రాశారట. అప్పటి నుంచి దీనిని వాడుతున్నాడు. 18, 19 వ శతాబ్దాలలో ప్రజలు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకోవడానికి ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకునేవారు. ఇంగ్లండ్‌లోని చాలా మంది ఇప్పటికీ మెర్రీ క్రిస్మస్‌కు బదులుగా హ్యాపీ క్రిస్మస్ అని చెబుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే పదాన్ని మొదట ఇంగ్లండ్ రాజు జార్జ్ v ఉపయోగించాడు. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ కూడా మేరీ కంటే హ్యాపీ అనే పదానికి ప్రాధాన్యత ఇచ్చింది. దీనితో పాటు బ్రిటన్‌లోని అనేక ఇతర ఉన్నత తరగతి ప్రజలు కూడా మేరీ స్థానంలో హ్యాపీ అనే పదాన్ని ఉపయోగించారు. మేరీ మరియు హ్యాపీ అనే పదాల మధ్య వ్యత్యాసం విషయానికొస్తే... రెండు పదాలను ఆనందాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తారు.