ఆ రోజునా...ఈ వస్తువులను భర్త భార్యకు ఇస్తే.. మంచిదట..

Divya
శుక్రవారం రోజు అనేది ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అని చెప్పవచ్చు. ఈ రోజు కోసం ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం చూసే ఉంటాం. అయితే శుక్రవారం రోజున అలా పూజ చేస్తూ ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తూనే ఉంటారు. అలా పాటించడం వల్ల మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి జీవితం చాలా ప్రశాంతంగా కొనసాగు పోతుంది. శుక్రవారం కేవలం అమ్మవారిని కాకుండా.. శుక్రుడిని కూడా పూజించడంవల్ల మనకి ఎంతో మేలు జరుగుతుందట. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

శుక్రవారం రోజున వివాహమైన స్త్రీలు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. మనం ప్రతిరోజు మాదిరే ఇంటిలో లైట్లన్నీ ఆఫ్ చేసి పడుకుంటాము.. శుక్రవారం రోజున మాత్రం ఈశాన్య దిశలో ఏదైనా ఒక ఒక లైట్ ఆన్ చేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి లోపలికి వచ్చేందుకు మార్గం ఏర్పడుతుందట. ఇక అంతే కాకుండా ఆవుకు గ్రాసము తినిపించడం చాలా మంచిదట. అలా చేయడం వల్ల ఎంతో శుభం జరుగుతుంది. ఇక అంతే కాకుండా మనం భోజనం చేయడానికి ముందే కాస్త అన్నాన్ని బెల్లం కలిపి ఆవుకి పెట్టడం చాలా మంచిది. ఆవు ఉన్న ఇంట ఎప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయి.

ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం రోజున పంచముఖి దీపాన్ని వెలిగిస్తే వాటి నుంచి బయట పడతారట. అమ్మవారి అనుగ్రహం అందాలంటే హారతి కర్పూరం లోని ఉండే బూడిదను మన దగ్గరే ఉంచుకోవాలి. అంతేకాకుండా శుక్రవారం సాయంత్రం వేళ భర్త తన భార్యకు ఏదైనా గిఫ్ట్ లాంటివి ఇస్తే.. వారి బంధం చాలా అన్యోన్యంగా ఉంటుందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. అయితే శుక్రవారం రోజున వారికి ఇష్టమైన దేవుళ్లను పూజించడం మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: