అమావాస్య లోపు ఇలా చేశారంటే..శుభం కలుగుతుందట..!

Divya
మన హిందువులకు రాబోయే అమావాస్య పౌర్ణములు ఎంతో ప్రత్యేకమైన రోజులు అని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో అనేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక వీటితోపాటే భాద్రపద నెలలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు నుండి అమావాస్య రోజు వరకు మధ్య గల రోజు చాలా పవిత్రమైనవి. ఈ మధ్య గల రోజులను మహాలయ పక్షాలు అని పిలవడం జరుగుతుంది. ఈరోజులనే సంతాప దినములుగా కూడా పిలుస్తూ ఉంటారు.

ఈ రోజున మన పూర్వీకులను పిండ ప్రధానం చేయడం వల్ల మన పూర్వీకులు, పితృ దేవతలు చాలా సంతోష పడతారు. ముఖ్యంగా ఏవైనా దోషాలు ఉన్న కూడా అవి తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఇక వీటితో పాటే పెళ్లి కాని వారికి వివాహ గడియలు రావడం జరుగుతాయట. ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా లభిస్తాయట. అందుచేతనే ఎవరైనా అందించిన పూర్వీకులకు ఈ 15 రోజుల లోపు పిండ ప్రధానం చేసి, వారి నామ కరణం మీద ఏదైనా దానం చేయాలట.
ఇప్పటివరకు ఇలాంటి పని ఎవరైనా చేయకుండా ఉంటారు వారు వచ్చే అమావాస్య లోపు ఈ పని చేయడం చాలా మంచిదని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ఇలాంటి పనులు మహాలయ అమావాస్య రోజున ఒక్కటే కాకుండా.. ప్రతిసారీ వచ్చేటువంటి అమావాస్యలలో ఏవైనా దాన ధర్మాలు చేసినట్లు అయితే మంచి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా బ్రాహ్మణులకు దానం చేయాలట.

బ్రాహ్మణునికి దానం చేయడం వల్ల, ఎన్నో వేల మందికి దానం చేసినట్లుగా సమానం అవుతుందట. అందుచేత నిన్న శుభ ఫలితాలు కూడా కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అమావాస్య రోజున ఏదైనా నది తీరాన మూడు సార్లు మునిగి తేలి, ఆ తర్వాత తర్పణం వదిలితే మన పూర్వీకులు చాలా సంతోష పడతారు అని కొంతమంది శాస్త్ర పండితులు తెలియ జేయడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: