కచ్చితంగా జీవితంలో ఒకసారైనా ఆ గుడికి వెళ్లాల్సిందేనట..!
రామేశ్వరం లో రామనాథ స్వామి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీరాముడు తమ పాదాల కథ నడిచిన కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి. అందుచేతనే ఆ ప్రాంతాన్ని రాములవారి ప్రాంతంగా భావిస్తారు. ఇక ఈ ప్రాంతంలోనే మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు కూడా జన్మించారు. ఈ దేవాలయం చుట్టుపక్కల తూర్పు సైడ్ ఉన్న పూరి జగన్నాథ్ ఆలయం, పడమర దిక్కున ద్వారక, ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం, దక్షిణాన రామేశ్వరానికి సంబంధించి కొన్ని ఆలయాలు ఉన్నవి.
అయితే రామేశ్వరానికి వెళ్లాలి అనుకున్న తర్వాత ఖచ్చితంగా వెళ్లాలి. లేదంటే చాలా పాపాలు చుట్టుకుంటాయి అని కొంత మంది పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా కాశీలోని గంగా జలాన్ని తీసుకువచ్చి రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్రంలో కలిపితే అప్పుడు కాశి యాత్ర అ పూర్తి అయినట్లుగా కొంతమంది తెలియజేస్తున్నారు. ఇక శ్రీరాముడు కూడా ఇక్కడి నుంచే ఒక కట్ట మాదిరి నిర్మించి లంకకు చేరుకున్నాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుచేతనే ఆ కట్టడాన్ని రామసేతువు గా పిలుస్తారు.
రావణాసురుడి వధించిన తరువాత, ఆ పాపాన్ని ని తొలగించుకోవడానికి శ్రీరాముడు స్వయంగా ఇక్కడ ఒక శివలింగాన్ని నిర్మించాడట. అందుచేతనే ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు తొలగి పోతాయని తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్నో విభిన్నమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక సీతాదేవి రావణాసురుడు ఎత్తుకు పోయేటప్పుడు.. అక్కడే ఆమె నగలు కొన్ని జారవిడిచింది అన్నట్లుగా సమాచారం. అందుచేతనే ఈ దేవాలయాన్ని మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని తెలియజేస్తుంటారు.