దీపావళి రోజున తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు...
కరోనా కల్లోల సమయంలో అందరికీ శానిటైజర్ లు బాగా అలవాటు అయిపోయాయి. కానీ దీపావళి రోజున మాత్రం శానిటైజర్ లు అస్సలు వాడకండి. ఎందుకంటే శానిటైజర్ కు మండే స్వభావం ఎక్కువ.
* టపాకాయలు ఆరు బయట ఇంటికి కాస్త దూరంగా కాల్చాలి. పూరి గుడిసెలు, కరెంటు స్తంభాలు, ఎండు గడ్డి వంటి చోట్ల టపాకాయలు పెల్చకండి.
* కొన్ని టపాసులు పేలకుండా మధ్యలోనే ఆరిపోతాయి.అయితే అటువంటి టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకండి ఇది చాలా ప్రమాదం. కొన్ని సార్లు బయటకు మంట కనిపించకపోయినా లోపల ఉన్న మందు మండుతూనే ఉంటుంది...అలా ఒక్కసారిగా పేలే అవకాశం ఉంది. అందుకే మధ్యలో ఆగిపోయిన టపాసులపై ముందు జాగ్రత్త కోసం కాస్త నీటిని పోయుట మంచిది.
*చాలామంది చిన్నారులు తమ జేబుల్లో చేతులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అయితే పెద్దవారు పిల్లల్ని ఒక గంట గమనిస్తూ ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి.
* పెద్ద పెద్ద బాణాసంచాలు లేదా కొత్త రకమైన టపాసులు పేల్చి ముందు...వాటి కవర్పై ఉన్న సూచనలు తప్పకుండా చదివి వాటిని పాటించడం సురక్షితం.
* సురసురాలు వంటివి కాల్చిన తర్వాత పక్కన నీటిలో కానీ ఇసుకలో కానీ వేయాలి. టపాసులు కాల్చే సమయంలో అందరూ పాదరక్షలు తప్పకుండా వేసుకోవాలి.
* అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పెద్దలంతా కూడా తమ పిల్లలు టపాకాయలు కాల్చే సమయంలో చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలి.