దీపారాధనకు ఏ నూనె శ్రేష్ఠం..?

Divya
ఇంట్లో దీపారాధన చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయం అని చెప్పవచ్చు.. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందు సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయాలని పండితులు చెబుతుంటారు. దీపారాధన చేసేటప్పుడు దీపం వెలిగించడానికి ఏ నూనెను ఉపయోగించాలి అనే విషయం తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు. దీపం వెలిగించే టప్పుడు ఎలాంటి నూనెతో దీపం వెలిగించడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం..
వేరుశెనగ నూనె:
వేరుశెనగ ఇంట్లో వంటలకు ఉపయోగిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపారాధన చేసేటప్పుడు ఈ వేరుశనగ నూనెను దీపారాధనకు ఉపయోగించరాదు.
ఆవు నెయ్యి:
నూనెలలో దీపారాధనకు ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టం.. మనం దీపారాధన చేసేటప్పుడు ఆవునెయ్యిని కనుక ఉపయోగించి, దీపారాధన చేసినట్లయితే ఇంట్లో ఆయురారోగ్యాలు , అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఆముదం నూనె:
ఆవు నెయ్యి తరువాత అంత శ్రేష్టమైన నూనె ఆముదం నూనె..ఈ నూనె తో దీపారాధన చేయడం వల్ల దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది అని.. జీవితాంతం ఒకరికొకరు సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు అని పండితులు చెబుతున్నారు. కష్టసుఖాల్లో కూడా భార్యభర్తలిద్దరు ఒకరికి ఒకరు ప్రాణంగా జీవిస్తారట.
విప్ప, వేప నూనెలు:
విప్ప నూనె లేదా వేప నూనెతో దీపారాధన చేయడం వలన మంచి ఆరోగ్యం ప్రసాదించబడుతుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు.దంపతులైతే ఆముదం నూనె తోనే దీపం వెలిగించండి..
నల్ల నువ్వుల నూనె:
ప్రతి రోజు శనివారం నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరుడికి దీపారాధన చేయడం వలన శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శనీశ్వరుడి చల్లని దీవెనలు మన పై పడితే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. వీలైనంత వరకు ప్రతి రోజు కూడా నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి.
తెలుసుకున్నారు కదా..! ఇక నుంచి అయినా ఈ నూనెలను ఉపయోగించి దీపారాధన చేసి సత్ఫలితాలను పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: