మేము అలా చెప్పలేదంటున్నటిటిడి

మేము అలా చెప్పలేదంటున్నటిటిడి


కోవిడ్-19 నిబంధనల అమలులో ఎలాంటి మార్పులు చేయలేదని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కోంది. కోరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అనుగుణంగా టిటిడి నడుచుకుంటోందని  2020  మార్చి 20 నుంచి కోవిడ్  నిబంధనలసు అమలు చేస్తోందని తెలిపింది. చంటి పిల్లల దర్శనాలను పునరుద్ధరించ లేదని  స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గతంలోనే తెలిపామనింది. వృద్దులు , వికలాంగుల దర్శనాల విషయంలోనూ అప్పటి స్థితి నె కొనసాగిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అదికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణకు రాలేదని, అందువల్ల ప్రత్యేక భక్తులకు దర్శనాల విషయంలో నాటి స్థితే కొనసాగుతోందని తెలిపింది.  సామాజిక మాధ్యమాలలో దివ్యాంగులకు, వృద్ధల విషయంలో అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయని, వీటని నమ్మవద్దని టిటిడి కోరింది. అవాస్తవాలను ప్రచారం చేయవద్దని టిటిడి సామాజిక మాధ్యమాలను కోరింది.  అసత్యమైన సమాచారాన్ని  ప్రజలకు అందజేయడం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందని తెలిపింది. ఇలాంటి విషయాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లవద్దని టిటిడి కోరింది.
అక్టోబ‌రు 20న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో అక్టోబ‌రు 20న బుధ‌వారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంట‌ల వరకూ మలయప్ప స్వామి సర్వాలంకార భూషితుడైన బంగారు గ‌రుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు.
శ్రీ‌వారిమెట్టు లోని శ్రీనివాస స్వామికి అష్ట‌బంధ‌న మహాసంప్రోక్షణ  
 శ్రీ‌వారి మెట్టు .... తిరుమల కొండకు వెళ్లే నడక దారి.  శ్రీ‌నివాస‌మంగాపురం స‌మీపంలోని శ్రీవారి మెట్టు  వద్ద గ‌ల వేంకటేశ్వర స్వామి  ఆలయంలో మహాసంప్రోక్షణ, అష్టబంధన కార్య‌క్ర‌మాలు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. యాగ‌శాల‌లో ఉదయం  వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. బుధ‌వారం భోగ‌శ్రీ‌నివాస‌మూర్తిని ప్ర‌తిష్టిస్తారు. ఈ  నేప‌థ్యంలో ఉద‌యం అభిషేకం, స్న‌ప‌న‌తిరుమంజ‌నం తో పాటు,  క్షీరాధివాసం నిర్వ‌హించారు. అక్టోబ‌రు 20న‌ మ‌హాశాంతి అభిషేకం, హోమాలు, పూర్ణాహుతి, ఆవాహ‌న అర్చ‌న  తదితర కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.  ఆ తరువాత ఉద‌యం 11 గంట‌ల‌ ప్రాంతంలో మ‌హాసంప్రోక్ష‌ణ జ‌రుగ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: