కృష్ణుడి ఆలయాల ప్రత్యేకత ఏమిటంటే...???

Sravani Manne
మహా విష్ణువు అవతారాలలో ఒక అవతారంగా శ్రీ కృష్ణ జననంను చెబుతారు.శ్రీ కృష్ణుడు ద్వారకను పరిపాలించాడు.మహా భారతంలో పాండవుల పక్షాన నిలిచి వారిని గెలిపించాడు.మహా భారతంతో పాటు వివిధ గ్రందాలలో కూడా అయన గురించి చెప్పారు. చిలిపి బాలునిగా,పశువుల కాపరిగా,గోపికలను  ఆట పట్టిస్తూ ఇలా ఎన్నిరకాలుగా చెప్పిన ఆయనను చాలా మంది దైవంగా భావిస్తారు.ఆయనకు ఎన్నో ఆలయాలు దేశవ్యాప్తంగా,ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.మన దేశంలోని సుప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయాల గురించిచాలా మందికి తెలియదు.అందులో మొదటిగా చెప్పుకొనేది ద్వారకాదిశ టెంపుల్.ఈ ఆలయం గుజరాత్లో ఉంది.ఈ దేవాలయాన్ని చాణుక్యుడు నిర్మించాడు.అద్బుతమైన శిల్పాలు,కళా నైపుణ్యం ఈ ఆలయంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.అప్పటిలోనే గ్రానేటు స్టోనులతో కట్టారు. గుజరాత్లోని గోమతి అనే ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది.


రెండవ ఆలయంగా చెప్పుకునేది కర్ణాటకలోని హంపిలోని బాలకృష్ణ ఆలయం.ఈ ఆలయాన్ని చేరుకోవాలి అంటే కొంచెం కష్టపడాల్సిందే.ఆ ఆలయాన్ని చేరుకున్నాక ఆ అలసటను మర్చిపోతారు.అక్కడి శిల్ప సంపదను చూస్తే ఆ అలసట మొత్తం పోయినట్లే.ఒకసారి చూపు పడితే అలానే చూస్తూ ఉండిపోతారు.ఈ ఆలయం బారతీయ వారసత్వ సంపదలో ఒకటి.

మూడవ ఆలయం బెంగళూర్లోని ఇస్కాన్ టెంపుల్.ఈ ఆలయం అతిపెద్ద శ్రీకృష్ణ ఆలయంగా పేరు గాంచింది.ఈ ఆలయాన్ని ఇస్కాన్ సంస్థ వారు 1997 లో నిర్మించారు.వైకుంట హిల్స్ మీద ఈ ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలో బంగారు పూతతో ఒక జెండా ఉంటుంది.పక్కనే కలశ శికరం ఉంటుంది.రొండు చూడదగినవే.


నాల్గవ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని ఇస్కాన్ బృందావన్ టెంపుల్.ఈ ఆలయాన్ని మధుర కృష్ణ బృందావన్ టెంపుల్ అని కూడా అంటారు.1975లో ఈ ఆలయాన్ని నిర్మించారు.ఇక అన్నిటికంటే ప్రత్యేకoగా చెప్పుకొనే పూరి ఆలయం ఒర్రిస్సాలో ఉంది.పూరి జగన్నాదుడు అంటే ఎంతో ప్రత్యేకత ఉంది.ఇక్కడ జరిగే పూజలను చూడటానికి కోట్లాదిమంది భక్తులు వస్తారు.


తర్వాత అమెరికాలోని రాధాకృష్ణ ఆలయం.ఈ ఆలయం యునైటెడ్ స్టేట్స్ లో ఉద్దాహ్ లో ఉంది.అక్కడే ఉన్న తెలుగువారు ఈ ఆలయాన్ని నిర్మించారు.వీటితో పాటు మదురలోని మధుర బృందావన చంద్రోదయ దేవాలయం.౩౦౦కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: