ఇకపై తిరుమలలో "గో ఆధారిత " సాంప్రదాయ భోజనం ..!

Divya
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రావీణ్యం పొందిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి కూడా ఒకటి. ఇక ఈ తిరుమల కొండ పైన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తి కొలువై ఉన్నాడు అని భక్తులు నమ్ముతారు. ఇక స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందడం కోసం నిత్యం కొన్ని వేల మంది భక్తులు దర్శించుకుంటూ వుంటారు. నిత్యం దీపారాధన తో, వేల మంది భక్తులు కిటకిట ల నడుమ పద్మావతి దేవి అమ్మవారి ఊరేగింపు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో అమ్మవారి లకు చేసే పూజలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

ఇకపోతే స్వామివారికి అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే భోజనాలు చాలా సాంప్రదాయబద్దంగా పండించి మరి వడ్డిస్తున్న విషయం తెలిసిందే. అంటే కేవలం గోవులతో వచ్చిన పేడ ద్వారా ఈ పంటలను పండించి వాటితో సాంప్రదాయ పద్ధతిలో నైవేద్యంగా ప్రసాదిస్తూ ఉంటారు. అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టే భోజనాలు కూడా ఇకపై భక్తులకు కూడా ఉచితంగా అందించాలని తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ నిర్ణయించింది. సుమారుగా 16 రకాల బియ్యం దినుసులను కూడా పండించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు భక్తులకు కూడా వడ్డించే మెనూలో 14 రకాల వంటలను వడ్డించాలని తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 26వ తేదీ గురువారం రోజున అన్నమయ్య భవన్లో కొంతమందికి ప్రయోగాత్మకంగా గో ఆధారితంగా పండించిన పంటల తో తయారు చేసిన భోజనాన్ని అందించడం జరిగింది. మరో 15 నుంచి 20 రోజుల్లోపు తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరి భక్తులకు ఇలాగే సంప్రదాయ పద్ధతిలో భోజనాన్ని వడ్డించాలని నిర్ణయం తీసుకున్నారట.
మన దేశీయ ఆవుల ఎరువులతో పండించిన పంటలతో ఈ వంటలను తయారు చేశారు. కులంకార్ బియ్యంతో తయారుచేసిన ఇడ్లీలు అలాగే కాలాబాత్ బియ్యంతో తయారు చేసిన ఉప్మా ను  తయారు చేశారు. వీటిని తినడం వల్ల వ్యాధి నిరోధకత పెంపొందడమే కాకుండా సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు. కొబ్బరి అన్నం,అన్నం, బోండా,ఇడ్లీ, పులిహోరా, పప్పు, ఉప్మా, పచ్చడి,సాంబారు, పూర్ణాలు,రసం, నెయ్యి,  పెరుగు ఇలా మొత్తం 14 రకాల ఆహార పదార్థాలను వడ్డించడం జరిగింది. ప్రస్తుతం భక్తుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి సెప్టెంబర్ 8 వరకు భోజనాలను వడ్డిస్తారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: