శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!
తెలుగు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు, ఐదు మంగళవారాలు ఆడవారికి ఎంతో ప్రాధాన్యమైనవి. శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేస్తే , మంగళవారం రోజున మంగళ గౌరీ పూజ చేస్తారు. అయితే ఈ రోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కాబట్టి ఈ రోజు ఏమి చేయాలో తెలుసుకుందాం..
ఈరోజు ఆడవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో గడపకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలి. ఈ కల్లాపి చల్లేటప్పుడు ఆవుపేడను మాత్రమే ఉపయోగించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా గుర్తించుకోవాలి. తలంటు స్నానం చేసి, పూజ గదిని శుభ్రం చేసి , దీపారాధన చేయాల్సి ఉంటుంది. తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం కోసం ఉడకబెట్టిన శనగలు, క్షీరాన్నం, ఆవు పాలు, బెల్లం తో కలిపి చేసిన అన్నం పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని నమ్మకం కూడా ఉంది.
శనగలను ముందురోజు రాత్రి స్నానం చేసిన తరువాత కొద్దిగా పసుపు వేసి నానబెట్టి , మరుసటి రోజు త్వరగా వుడింకించడానికి వీలుగా ఉంటుంది. మనకు దొరికే నల్ల శనగలను మాత్రమే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత అమ్మవారిని పసుపు ,కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. తర్వాత అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నైవేద్యాన్ని రెండు విస్తరాకుల లో అమ్మవారి ముందు పెట్టాలి. ముఖ్యంగా పూజ చేసే ఆడవాళ్ళు .. ఎరుపు లేదా పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన చీరలను ధరించి ముఖానికి ,కాళ్లకు, చేతులకు కూడా పసుపు పూసుకుని , కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆమె త్వరగా ప్రసన్నం అవుతుందట.
మొదటి శుక్రవారంతో పాటు మిగతా మూడు శుక్రవారాలలో కూడా పూజ ఇలాగే చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెంది ,ఆమె కరుణా కటాక్షాలను మన కుటుంబం పై వుంచుతుందట. తద్వారా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో కుటుంబాలు తోలతుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.