ఈరోజు పెళ్లి కాని వారి కోసం ప్రత్యేకం..!!
అది చుక్కల అమావాస్య.. అందులోనూ ఆదివారం అమావాస్య రావడం చాలా అరుదు. ఈ రోజు కనుక గౌరీమాతను పూజించడంలో వల్ల తప్పక శుభఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు నెలలో ఆషాడ మాసం నాలగవ నెల. ఈ నెల చివరి రోజైన ఈ చుక్కల అమావాస్య గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ నాటి కాలం యువతకు ఈ విశిష్టత గురించి పెద్దగా తెలియదు. ఇక తిరిగి రేపటినుంచి శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఈ రోజున తలుచుకున్న ఏ పని అయినా , నిర్విరామంగా పూర్తవుతుందని పెద్దలు నమ్మేవారు.
ముఖ్యంగా ఈ రోజు పితృదేవతలను తలచుకున్నా, దీప పూజ చేసిన , గౌరీవ్రతం పాటించిన తప్పకుండా ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా దక్షిణాయనంలో రాబోయే తొలి అమావాస్య రోజున పితృ దేవతలకు ఆహ్వానం పలుకుతూ, తర్పణాలు విడుస్తారు.ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుంది ..దానిని చుక్కల అమావాస్య అంటారు.
ఈ ఆషాడ మాసంలో ముఖ్యంగా ఎవరికైనా దానధర్మాలు ఇచ్చినా మంచి శుభ ఫలితం కలుగుతుందట. ఆషాడ చివరి అమావాస్య రోజున గౌరీ మాత కు పూజ చేసి, మనసులో మాట తలుచుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసానికి ముందు రోజు కన్నెపిల్లలు ఒక పసుపు ముద్దను తయారు చేసి, దానిని గౌరీదేవిగా భావించి, కుంకుమ బొట్లు పెట్టి , బియ్యం పిండిని మెత్తగా జల్లించి కుడుములను చేసి , గౌరీ మాత కు ప్రసాదంగా సమర్పించిన, పెళ్ళికాని అమ్మాయిలకు వివాహం జరుగుతుంది అని నమ్మకం.