'దీపారాధన'లో పాటించాల్సిన నియమాలివే ?

VAMSI
దేవునికి పూజ చేయడంలో భాగంగా దీపారాధన కూడా చేస్తుంటారు. అలాగే ప్రతి రోజూ దీపారాదన చేసే సమయంలో మహిళలకు చాలా సందేహాలు వస్తుంటాయి. ఎన్ని వత్తులతో దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన దీపం ఏ దిక్కుకు ఉండాలి, ఏ సైజు దీపపు కుందును ఉపయోగించాలి. ఇలా పలు రకాల ధర్మ సందేహాలు ఉంటాయి. కొన్ని నియమాలను సరిగా పాటించకపోవడం వలన లక్ష్మీ మాత ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉన్ననుందున అన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. నిత్య దీపారాధన కొరకు పెళ్లి కానీ స్త్రీలు అయితే  మూడు అంగుళాల కుందుల పొడవు కి మించి వినియోగించరాదు. పెళ్ళైన స్త్రీలు అయితే మూడు నుండి ఆరు అంగుళాల కుందులను నిత్య దీపారాధనకు వినియోగించాలి.
అంతకు మించి వినియోగించరాదు. ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఫంక్షన్ల కొరకు అనగా సామూహిక పూజలు చేసే సమయంలో మాత్రం ఆరు అంగుళాలు మించిన కుందులను ఉపయోగించవచ్చు. ఇక దీపారాధన కొరకు వేరుశనగ నూనెను అస్సలు వినియోగించరాదు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, విప్ప నూనె ఇలా మరే ఇతర నూనెను అయినా వాడవచ్చును. భవిష్యోత్తర పురాణం ప్రకారం నువ్వుల నూనె దీపారాధనకు ఉపయోగించడం శ్రేష్ఠం. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. దీపంలో ఒక వత్తిని వేసి ఎప్పుడూ వెలింగించరాదు. రెండు వత్తులను వెలిగించుట మంచిది. రెండు వత్తులు జీవాత్మ పరమాత్మల ఐక్యతకు సంకేతం కాబట్టి ఒక వత్తి మాత్రం ఉండరాదు.
రెండిటినీ కలిపి ఒకటిగా...మరియు ఆ తర్వాత విడిగా ఎన్ని వత్తులు అయినా వెలిగించవచ్చు. లక్ష్మీ కటాక్షం కలగాలంటే పెళ్ళైన స్త్రీలు  మూడు వత్తులు ఉన్న దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన దీపం తూర్పు ముఖంగా ఉండాలి.  ఉత్తరం వైపు న దీపం వెలిగిస్తే కుబేరుని ఆశీస్సులు అందుతాయి. అలాగే లక్ష్మీకటాక్షం వరిస్తుంది. పడమర దిక్కు న ఉంచితే  గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీకు ఏమైనా దోషములు ఉంటె అవి తొలగిపోతాయి. దక్షిణ వైపు మాత్రం ఖచ్చితంగా దీపం ఉండరాదు. ఈ దిశ వైపు దీపం ఉంచినట్లయితే అది యమ స్థానం కాబట్టి అరిష్టం. ఈ విధంగా నిత్య దీపారాధన చేసే వారు ఈ జాగ్రత్తకు పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: