తథాస్తు దేవతలు నిజంగా ఉంటారా ? వాస్తవమిదే ?
అవును ఇది వాస్తవం పైన తథాస్తు దేవతలు ఉంటారు అని మన పురాణాల్లో చెప్పబడింది. ఇంతకీ తదాస్తు అనే మాటకు అర్థం ఏమిటంటే ? తదా అనగా ఆ ప్రకారంగా, అస్తు అంటే జరగాల్సింది అని అర్థం. మనిషి తన జీవనానికి విరుద్ధంగా అనకూడని మాట లను పదే పదే అంటుంటే తథాస్తు దేవతలు తథాస్తు అని అంటారు. అప్పుడు ఆ కోరిక ఏదో ఒక రూపంలో తప్పక నెరవేరుతుంది. అందుకని మాట అనేముందు జాగ్రత్త వహించాలి తథాస్తు దేవతలను దృష్టిలో ఉంచుకొని మన మాట బయటకు రావాలి అని చెబుతున్నారు.
సూర్యుని పుత్రులైన అశ్విని కుమారులే తథాస్తు దేవతలుగా చెప్పబడుతున్నారు. వీరిని దేవత వైద్యులు అని కూడా పిలుస్తారు అని పురాణాల్లో చెప్పబడింది. వీరు వినియోగించే రథం బంగారంతో చేయించబడినది. ఆ రథంపై ఆకాశంలో ఎంతో వేగంగా పయనిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారి ప్రయాణంలో తథాస్తు అని పలుకుతుంటారు. అశ్వనీ కుమారులైన తథాస్తు దేవతలు ఒక చేతితో ఆయుర్వేద పుస్తకాన్ని మరో చేతితో అభయ హస్తం చూపుతో ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు . వాస్తవానికి తథాస్తు దేవతలు సంధ్యా సమయంలో ఎక్కువ సంచరిస్తూ ఉంటారట. ఆ సమయంలో మన నోటి నుండి ఏ మాట వస్తే దానిని వారు తథాస్తు అంటారని ఒక విశ్వాసం. స్వచ్ఛమైన, నిస్వార్థమైన మనసుతో కోరుకునే కోరికలను తథాస్తు దేవతలు నెరవేరుస్తారని మన పురాణాలు చెబుతున్నాయి.