అన్నపూర్ణమ్మ అనుగ్రహము పొందాలంటే ఇలా చేయండి...?

VAMSI
కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఎంత సంపాదించినా గుప్పెడు అన్నం నోటిలోకి పోనిదే... మనకు నిద్ర పట్టదు. ఆ అన్నం దొరకాలంటే అందుకు కారణం అన్నపూర్ణా దేవి అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మన కుటుంబంలో సుఖ సంతోషాలు వెలగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగాలన్నా, మూడుపూటలా కడుపునిండా భోజనం, కంటినిండా నిద్రకు కావాల్సిన ప్రశాంతత.. ఇవన్నీ మీ కుటుంబానికి దక్కాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉండాలి. అలా కాకుండా మాతకు నచ్చని పనులు ఇంట్లో చేస్తే... ఆమె ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండదు, వెళ్లిపోతుంది. అప్పుడు మిగిలేది అంతా దుఃఖమే.

అలా కాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పాచి ముఖంతో వంటింట్లోకి అడుగు పెట్టరాదు, కనీసం ముఖం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్న తరువాతనే వంటగది లోకి వెళ్లాలి. ఇక బయటికి పరగడుపున వెళ్లరాదు. ఇలా ఖాళీ కడుపుతో కుటుంబంలోని వ్యక్తి  బయటకు వెళ్తే ఆ పని జరగకపోగా సమస్యల్లో పడతారట.... కాబట్టి కనీసం ఒక చెంచాడు తియ్యటి పెరుగు నైనా తినేసి బయటికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇంట్లో నుండి బయటకు బయలుదేరే ప్రతిసారి... మన ఇష్టదైవాన్ని ఒకసారి చూసి నమస్కరించి వెళ్ళాలి.

ఇలా చేయడం వల్ల వెళ్లిన పని జరిగినా జరగకపోయినా.. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. కాబట్టి ఇంటి నుండి ఎక్కడికైనా వెళ్లే ముందు మీ ఇష్ట దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి, అప్పుడు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మనపై ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వ్యక్తులు పనిమీద బయటకు వెళ్తున్నారు అంటే. .. మన ఇల్లు అంతా శుభ్రంగా ఉండాలి, లేదంటే మీతో పాటు లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత తిరిగి ఆ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే చాలా కష్టతరం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: