మీ కోరికలు నెరవేరడం లేదా అయితే ఈ వ్రతం చేయండి...?

VAMSI
సాయిబాబా... మానవ రూపంలో ఈ భువిపై జన్మించిన   దైవమూర్తి గా ప్రజలు బాబాని కొలుస్తుంటారు. సాయిబాబా చరిత్ర అమోఘం, ఆయన లీలలు అద్భుతం. హిందువులలో ఎక్కువమంది కొలిచే దేవుళ్ళలో సాయిబాబా ఒకరు. నిత్యం పూజ చేస్తూ ఆ బాబాను స్మరిస్తూ ఉంటారు  భక్తులు. ఇక గురువారం అయితే  సాయిబాబా ప్రతిమకు  పాలాభిషేకం చేసి, ప్రత్యేకమైన నైవేద్యం పెట్టి ధూప దీపాలతో పూజలు జరుపుతుంటారు. ఇలా ఆ శిరిడి సాయిని నమ్మి పూజించే భక్తులపై ఆ సాయి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అయితే కొందరికి గ్రహ దోషాల వలన, వారు చేసుకున్న కర్మల వలన జీవితంలో కొన్ని అడ్డంకులు, కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. 


మరి కొందరు ఉద్యోగం కోసం, కళ్యాణం కోసం, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు... ఎన్ని వ్రతాలు చేసినా లాభం ఉండకపోవచ్చు. అలాంటి వారు సాయిబాబా వ్రతాన్ని చేస్తే... వారి కోరికలు తప్పక నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఆ వ్రతం చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. సాయిబాబా వ్రతాన్ని... మూడు, ఐదు లేదా తొమ్మిది గురువారాలు అనుకుని మొదలుపెట్టాలి. ఇక ఈ వ్రతం ఎలా చేయాలంటే పూజ మొదలు పెట్టే మొదటి గురువారం నాడు... సాయిబాబా ప్రతిమకు పాలాభిషేకం చేసి శుభ్రం చేసుకుని, పూజకు కావాల్సినవన్నీటినీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా రూపాయి, లేదా రెండు రూపాయల నాణెము తీసుకొని మీ కోరికను ఆ బాబాకు చెప్పి ఆ  నాణెమును ముడుపు కట్టాలి. 


ఆ కట్టిన  ముడుపును బాబా పాదాల వద్ద ఉంచాలి. వాడని కంచు పళ్ళాన్ని సిద్ధం చేసుకొని అందులో బాబా ప్రతిమను, వినాయకుని ప్రతిమను కానీ ఫోటో కానీ, అదే విధంగా లక్ష్మీ మాత ప్రతిమ కానీ ఫోటో కానీ ఉంచాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అనంతరం సాయిబాబా వ్రతం బుక్ లో ఉన్న ఈ మంత్రాలను జపిస్తూ... బాబా ప్రతిమను పూలతో అర్చించాలి. తర్వాత ధూపాన్ని వేసి కొబ్బరికాయను కొట్టి ఆ బాబాకి మన మనసులోని కోరికలను చెప్పుకోవాలి. ఇలా మూడు, ఐదు లేదా 9 గురువారాలు ఈ వ్రతాన్ని చేసి చివరి వారం ముత్తైదువులను పిలిచి.. పూలు పూలతో పాటు బాబా ఫోటో ని కూడా వారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా సాయిబాబా వ్రతం చేయడం వల్ల మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: