శ్రీరాముడి "పుట్టిన రోజు - పెళ్లి రోజు" ఈ రోజేనా...?

VAMSI
ఈ రోజున శ్రీరామనవమిగా హిందువులంతా శ్రీరాముని పూజిస్తారు. శ్రీరామనవమి అనగా శ్రీరాముని పుట్టినరోజు. ఈ పుట్టినరోజు చైత్ర శుద్ధ నవమి రోజున వస్తుంది. కానీ ఇప్పటికీ కొంతమంది భక్తుల మదిలో ఒక సందేహం నెలకొంది. ఇదే రోజున సీతారాముల పెళ్ళిరోజని చెబుతూ ఉన్నారు. అయితే ఈ రెండింటిలో నిజమేమిటి...? ఈ రోజు శ్రీరాముని పుట్టిన రోజా...? లేదా సీతారాముల కళ్యాణం జరిగిన రోజా...? లేదా రెండూ ఈ రోజే జరిగాయా..? ఇప్పుడు తెలుసుకుందాము. అయితే దీనికి పండితులు చెప్పిన సమాధానమేమిటో చూద్దాం. శ్రీరాముని జననం త్రేతాయుగంలో చైత్ర మాసం, వసంత ఋతువు శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగింది.
ఈ యుగానికి కలిపురుషుడు ఆదర్శ పురుషుడు పుట్టాడని ప్రజలంతా ఒక కన్నుల పండుగగా జరుపుకుంటూ వస్తున్నారు. ఆ తరువాత విద్యాబ్యాసం మొదలుకొని సీతమ్మతో వివాహం వరకు అన్నీ పద్దతి ప్రకారం జరిగాయి. సరిగా శ్రీరాముని పట్టాభిషేకం సమయంలో తండ్రి ఆనతి మేరకు అడవులకు వెళ్ళవలసి వచ్చింది. అరణ్యవాసంలోనే రావణాసుర వధ జరిగింది. ఆ తరువాత మళ్ళీ తిరిగి శ్రీరాముడు సీతతో సహా అయోధ్యలో అడుగుపెట్టాడు. ఈ సంఘటన కూడా సరిగ్గా చైత్ర శుద్ధ నవమి రోజునే జరిగిందని ప్రజల నమ్మకం.
అందుకే ప్రజలంతా సీతారాముల వివాహం అదే రోజున జరిగిందని ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం మార్గశిర మాస శుక్లపక్ష పంచమి రోజున సీతారాముల వివాహం జరిగిందని తెలుస్తోంది. అందుకే ఈనాటికీ నేపాల్ లోని జనకుర్సి ప్రాంతంలో నేటికి మార్గశిరమాసంలో రామకళ్యాణం చేస్తుంటారు. కాబట్టి శ్రీరాముని జననం, వివాహం మరియు రాజ్య పునరాగమనం ఒకే రోజున జరిగాయని ఎక్కువమంది నమ్ముతున్నారు. ఈ విధంగా అప్పటి నుండి ఈనాటి వరకు శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: