మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇతరులకు సహాయం చేయడం, దానం చేయడం. ఓ వ్యక్తిని మంచి వ్యక్తా కాదా వారి గుణగుణాలేంటి అని తెలుసుకోవటానికి ఆ వ్యక్తి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోనక్కర్లేదు..ఆ వ్యక్తిలోని కొన్ని లక్షణాలను పరిశీలిస్తే చాలు. వాటిలో ముఖ్యమైనవి ఆ వ్యక్తి యొక్క నడవడిక అలాగే దానం చేసే గుణం. అయితే దాన గుణం అన్ని చోట్లా ..అన్ని వేళలా మంచిది కాదు. కొన్ని వస్తవులను దానం చేయడం వలన పుణ్యానికి బదులు శని చుట్టుకుంటుంది. అందులోనూ ఎప్పుడు ఏ వస్తువు దానం చేయకూడదో అన్న విషయాన్ని తప్పకుండ తెలుసుకోవాలి. సాధారణంగా ఇలాంటి విషయాలను ఎక్కువగా హిందువులు విశ్వసిస్తుంటారు. ఏమైనా ముఖ్యమైన పనులు చేసే ముందు వారం వర్జ్యం చూసుకుని మరీ మొదలుపెడుతుంటారు. అలాంటిది కొన్ని విషయాలు తెలియక పొరపాట్లు చేసి ఏళ్లనాటి శనిని ఇంటికి తెచ్చుకొని మరీ పడరాని కష్టాలు పడుతుంటారు. అలాంటివాటిలో కొన్నింటిని ఇపుడు తెలుసుకుందాం.
ఇవి తెలుసుకొని జాగ్రత్త పడడటం వలన సమస్యలలో పడకుండా ఉండవచ్చు. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అన్నా.. ఏ చీకు చింత లేకుండా జీవితం సాఫీగా సాగాలన్నా కావల్సింది ధనం. ఆ ధనానికి మూలం శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీదేవి కొలువైయున్న ఇల్లు నిత్యం భోగ భాగ్యాలతో, ఆనంద ఉత్సవాల మధ్య వెలిగిపోతుంది. అలాంటి ఆ మహా లక్ష్మికి కొన్ని నచ్చని పనులు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని చేయడం చేత ఆ లక్ష్మి దేవికి ఆగ్రహం వచ్చి ఇంటిని వీడి వెళ్లి పోతుంది..దాంతో దరిద్రం ఇంట్లో తాండవించి కుటుంబం కష్టాలతో మునిగి పోతుంది. ఇంతకీ ఆ పనులేమిటంటే.. ఇంట్లో నుండి ఉప్పును కానీ నూనెను కానీ ఎప్పుడూ ఎవరికీ ఆ అరువుగా కానీ, దానంగా కానీ ఇవ్వరాదు.
చిరిగిన వస్త్రాలను దానం చేయరాదు. పాడైపోయిన పాత్రలను ఎవరికీ ఇవ్వరాదు. విరిగిపోయిన వస్తువును కానీ, అసలు మనకు పనికిరాని ఏ వస్తువును దానం చేయకూడదు. అదేవిధంగా పాడైపోయిన , తినడానికి పనికిరాని తిను పదార్థాలు సైతం దానమివ్వకూడదు. ఇలాంటి ఆహారాన్ని దానం చేయడం ద్వారా పోలీస్ స్టేషన్ న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయి. సూది , కత్తెర, వస్తువులను దానం చేయడం ద్వారా సంసారంలో చిక్కులు మొదలవుతాయి. అంతేకాక చీపురులను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయరాదు. ఇంటి నుండి బయటకు పంపడం. శుక్రవారం నాడు డబ్బులు అరువుగా కానీ, దానంగా కానీ ఇవ్వరాదు. ఇవన్నీ తెలుసుకుని ముందుగా జాగ్రత్త పడడం వలన మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండి ధనధాన్యాలు చేకూరుస్తుంది...