ఒక్కో ఉగాదికి ఒక్కో పేరెందుకు.? ప్లవ అంటే అర్థం ఏంటి.?

హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కావడం వల్ల ఈరోజును ఉగాదిగా భావిస్తారు. కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనే అర్థం ఉగాదిలో మిలితమై ఉంది. అంతే కాకుండా ఉగాది అనగా ఈరోజు నుండి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందువల్లే ఆలయాల్లో ఉగాది పండగ సంధర్బంగా పంచాంగ శ్రవణం చదివిస్తారు. ఈ పండగను తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, మహారాష్ట్ర లో సైతం జరుపుకుంటారు. ఉగాది అనే పదం యుగ.... ఆది అనే రెండు పదాల నుండి వచ్చింది. దీనికి కొత్త శకం ప్రారంభం అవ్వడం అనే అర్థం వస్తుంది. అందువల్లే ఈ పండగను ఉగాది అని పిలుస్తారు. ఇదిలా ఉండగా కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదటి కాపురానికి వచ్చిన వారితో ఉగాది పచ్చడి తయారు చేయిస్తారు. అంతే కాకుండా కొత్త కాపు తో తయారు చేయిస్తారు. కొత్త బెల్లం, వేప పూత, మామిడికాయ, చింతపండు, మిరియాలు, ఉప్పు లాంటి పదార్థాలతో తయారు చేస్తారు. 


అయితే ఉగాది ప్రతి సంవత్సరం వస్తుంది..ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఇలా ఒక్కో ఉగాదికి ఒక్కో పేరు ఎందుకు వచ్చిందంటే..? పురాణాల ప్రకారం విష్ణు మాయ కారణముగా నారదుడికి జన్మించిన 60 మంది సంతానమే...ఈ తెలుగు సంవత్సరాలట. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరమివ్వడంతో ప్రతి ఏడాదికి పేర్లు మారిపోతు ఉంటాయి. ఇక ఈ ఉగాది పేరు.. ప్లవ నామ సంవత్సరం. "ప్లవ" అంటే దాటించునది అనే అర్థం వస్తుంది. తెప్ప అని దీని అర్థం. ఇక నానార్థాలు చూస్తే..ఈదుట, తేలుట ,దూకుట, కోతి, ఏకాన్వయ మూకల ఐదురు శ్లోకముల ఒక సంవత్సరం అనే  నానార్థాలు వస్తాయి. ఇక ప్లవ నామ సంవత్సరానికి అధిపతి అగ్నిదేవుడు..కాబట్టి ఈ ఏడాది ప్రతి ఒక్కరూ అగ్నిని ఆరాధించవలసిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: