రోజూ 3 సార్లు రంగులు మారే శివలింగం.. ఎక్కడుందో తెలుసా?
ఉదయం పూట తో ఎరుపు రంగులో, మధ్యాహ్నం కాషాయరంగులో, రాత్రిపూట నలుపు రంగులోకి దాని అంతట అదే మారుతుంది. అయితే ఈ శివలింగం ఇలా మూడు పూటలా మూడు రంగుల్లో మారడానికి కారణం ఏమిటన్న విషయంపై ఎన్నో పరిశోధనలు జరిగినప్పటికీ ఎవ్వరికీ సమాధానం లభించలేదు. ఇది సాక్షాత్తు ఆ శివుడే సృష్టించిన వింతగా అందరూ అంటున్నారు. ఈ ఆలయం 2,500 ఏళ్ల నాటిదిగా ఇక్కడి వారు చెబుతున్నారు. ఎంతో మహిమగల శివలింగం ఉన్న ఆలయంగా ఈ శివాలయం ప్రసిద్ధి చెందింది. రాజస్థాని పాలరాళ్లతో రూపుదిద్దుకున్న ఈ దేవాలయం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో శివునికి ప్రత్యేక పూజలు జరిపితే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రతీతి.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు అన్ని శివాలయాల్లో అలాగే ఈ దేవాలయంలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుతారు. ఈ సమయంలో భక్త జనులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకొని... ఆ శివుని దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చమని వేడుకుంటారు. ఇక్కడ మరో చిత్రమైన విషయం ఏమిటంటే.... ఈ శివాలయంలో సగం గుండ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంది. దీన్ని మహేశ్వరుడు బొటనవేలు గా చెబుతుంటారు. కాగా ఇందులో నీళ్లు పోస్తే... ఆ నీరు వెంటనే మాయం అవుతుంది. మాయమైన నీరు ఎక్కడికి చేరుతోంది... ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఆ శివుని లీలలలో భాగమని ఒక నమ్మకం.