మహిళ అంటే శ్రీరాముని పత్ని సీతాదేవిలా ఉండాలి...?
రాముడు నైమిశారాణ్యంలో అశ్వమేధ యాగం చేసాడు. ఆ యజ్ఞానికి వాల్మీకి మహర్షి శిష్య సమేతంగా వెళ్ళాడు. వాల్మీకి కుశలవులను రామాయణాన్ని గానం చేయమని ఆదేశిం చాడు. రామాయణాన్ని విన్న రాముడు వారు సీత పుత్రులే అని నిశ్చయించుకున్నాడు. ఆ తరువాత సీత తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే విధంగా ఏదైనా చేయాలనీ తన దూతల ద్వారా సందేశం పంపిస్తాడు శ్రీ రాముడు. దీనికి సీత వాల్మీకితో పాటుగా సభలోకి ప్రవేశించింది సీత. సీత తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఏమి చేయబోతోంది అని తెల్సుకోవాడ్నైకి జనం కోకొల్లలలుగా వచ్చారు. దీనితో ఆ సభ అంతా ప్రజలతో కిక్కిరిసిపోయింది.
వాల్మీకి సీత ఏమి చేయనవశర్మ లేదు. నేను చేసే తప్పస్సు సాక్షిగా సీత ఎటువంటి తప్పు చేయలేదు అని సభలో చెప్పాడు. అప్పుడు రాముడు సీత గురించి నాకు తెలుసని, కానీ లోకానికి తెలియడానికి ఇదంతా అని చెప్పాడు. పైగా లవకుశలిద్దరినీ తన బిడ్డలేనని అంగీకరించాడు. సీత త్రికరణశుద్ధిగా తాను రాముడిని పూజించి నట్లయితే వివరమిమ్మని భూదేవిని ప్రార్థించింది మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే । తథామే మాధవీ దేవి వివరం దాతుమర్హతి ॥ అప్పుడు భూమి విచ్చుకుంది. " ఇదిగో ఋజువు " అంటూ సీత భూమి ఒడిలోచేరింది. భూదేవి సీతను సింహాసనంపై కూర్చోబెట్టుకొని రసాతలానికి వెళ్ళిపోయింది. ఈ విషాద పర్యవసానానికి ప్రజలు నిర్వీణ్ణు లయ్యారు. రాముడు శోక సముద్రంలో మునిగి పోయాడు. సీతాదేవి మహా పతివ్రత..ఈ లోకంలో ప్రతి స్త్రీ సీతలాగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు.