లక్ష్మి దేవికి గుడ్ల గూబ వాహనంగా ఉండడానికి కారణం ఇదే...?

VAMSI
పురాణాల ప్రకారం హిందూ ధర్మం ప్రకారం మనకు చాలా మంది దేవుళ్లున్నారు. వారి వారి భక్తిని బట్టి ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తారు. అయితే ఈ దేవుళ్లందరికీ ఒక్కొక్క వాహనం ఉండడం అందరీకీ తెలిసే ఉంటుంది. అయితే అవి ఆ దేవుళ్ళకు ఎలా కేటాయించబడ్డాయి. ఎందుకు వాటినే వారు తీసుకోవడం జరిగింది. అటువంటిది ఈరోజు మనం లక్ష్మి దేవికి ఏ వాహనం ఉంద్. ఆ వాహనం ఉండడానికి కారణం ఏమిటో తెలుసుకుందామా...? లక్ష్మి దేవి అంటే సంపదకు ప్రతిరూపం. అమ్మవారిని ధనలక్ష్మిగా కొలుస్తారు. మరి అమ్మవారికి గుడ్లగూబ వాహనంగా ఎలా మారింది.
మాములుగా మనము అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలంటే మన యందు లక్ష్మి దేవి దయ కటాక్షం ఖచ్చితంగా ఉండాలి. దేని కోసం పండితులు లక్ష్మి దేవిని అనుగ్రహం కోసం పూజించాలని చెబుతున్నారు. ముక్కోటి దేవతల్లో లక్ష్మీదేవికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ధనలక్ష్మిగా ప్రతి ఒక్కరిని కరుణించే అమ్మకు పూజలు చేస్తుంటారు ప్రతి ఒక్కరు. మనకున్న దేవతల్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో వాహనము ఉంటుంది. అలాగే లక్ష్మీ దేవికి గుడ్లగూబ వాహనంగా ఉంది. గుడ్లగూబల స్వభావం మీకు తెలిసిందే రాత్రి పూట మాత్రమే వీటికి కళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. హిందువులంతా గుడ్లగూబను వ్యతిరేఖ శక్తిగా చూస్తుంటారు.
మన ఇంటి దగరలో గుడ్లగూబ అరిస్తే అది మన ఇంటికి మంచి శకునం కాదని భయపడుతుంటారు. మరి అలాంటి గుడ్లగూబను లక్ష్మీదేవి అమ్మవారు వాహనంగా ఎందుకు మార్చుకున్నారు? పురాణాల ప్రకారం ఒక ముని శాపంతో ఇంద్రుడు సముద్రంలో జీవించాల్సి వచ్చింది. అప్పుడు పాల సముద్రాన్ని చిలికినప్పుడు విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం లక్ష్మీ దేవి సముద్రంలో నుండి పైకి వచ్చింది. తనకుంటూ ఓ వాహనం కావాలనుకున్న ఆమె... అయితే అప్పటికే నెమలిని మరొకరు వాహనంగా కలిగివుండటంతో... అమ్మవారు గుడ్లగూబను తన వాహనంగా చేసుకున్నారని ప్రతీతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: