శాకాంబరి పూర్ణిమ రోజు సాయంత్రం చేయాల్సిన పనులివే...?
ఈ పూర్ణిమ రోజున కొన్నిపనులను చేయడానికి లేదు. అదే విధంగా కొన్నిపనులను మాత్రం తప్పకుండా చేయవలసి వస్తుంది. అవేమిటో తెలుసుకుందామా...? ఈ రోజున పవిత్ర స్నానం చేసి, అమ్మవారిని దర్శించుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ శుభ దినాన భక్తులంతా తప్పకుండా దానధర్మాలు చేయవలసి ఉంటుంది. అంతే కాకుండా శాకాంబరి దేవి విగ్రహాన్ని కూరగాయాలతో అలంకరించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. పవిత్రమైన ప్రసాదాన్ని మాత్రమే శాకాంబరి దేవికి పెట్టాలి. అలా దేవతలు పెట్టిన ప్రసాదాన్ని కొంచెం సేపటి తరువాత భక్తులందరికీ పంచి పెట్టాలి.
అదే రోజున మీకు దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే తప్పక దర్శించి, ఆ దేవిని ఆరాధించాలి. మీకు శక్తికి మించినంత విరాళాన్ని దేవుని గుడికి ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన ఆ శాకాంబరి దేవి అనుగ్రహం మీ పైన ఉంటుంది.ఈ పూర్ణిమ రోజున పై విధంగా మీరు చేసినట్లయితే మీకు ఎటువంటి కష్టాలు ఉన్న కానీ అవన్నీ తీరిపోయి సుఖ శాంతులతో జీవిస్తారు. అంతే కాకుండా మీరు కోరుకున్న కోరికలన్నీ ఆ దేవి తప్పక తీరుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే ఆ దేవత ఆశీర్వాదాలతో పాటు, వారి ఇళ్లలో శ్రేయస్సు పొందుతుంది.