గుడిలో అలా ఎందుకు చేస్తారో తెలుసా...?
"అనాయాసేన మరణం" నాకు నొప్పి లేక బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు....
"వినా ధైన్యేన జీవనం" నాకు ఎవరి మీదా ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు....
"దేహాంతే తవ సాన్నిధ్యం" మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. ...
"దేహిమే పరమేశ్వరం" ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను....
భగవంతుడా ప్రతిక్షణం నిన్ను పూజించే భాగ్యాన్ని ప్రసాదించు. నీ అనుగ్రహం ఎప్పుడూ నాతో ఉండేలా నన్ను కరుణించు...
భగవంతుడా నా జీవితంలో ఎప్పుడూ నాకు కానీ నా పిల్లలకు కానీ సంపదలు లేదా పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను. కానీ నాకు అతి ఉత్తమమమైన నీ సాన్నిత్యాన్ని అనుగ్రహించు. అంతే కాకుండా నీవు ఎప్పుడూ నాకు అండగా ఉండి నన్ను మంచి మార్గంలో నడిపిస్తావని ప్రార్ధిస్తున్నాను.
పై విధంగా మీరు కనుక భగవంతుని కోరితే మీరు ఏ గుడికి వెళ్ళినా ఆ భగవంతుడు మీ కోరికలు తీరుస్తాడు.