మీ శరీరంలోని ఈభాగంలో పుట్టుమచ్చలున్నాయా....అయితే ఇది తెలుసుకోండి...?

VAMSI
ఏదేమైనా మనిషి శరీరం పై ఉండే పుట్టు మచ్చలను బట్టి వ్యక్తి యొక్క జీవితాన్ని అంచనావేసే శాస్త్రాల్ని.... ఎందరో విశ్వసిస్తుంటారు. ఇది వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొన్ని  పుట్టుమచ్చల గురించి తెలుసుకుందాం. కొన్ని రకాల పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఒకే ఫలితాన్ని ఇస్తాయి మరికొన్ని పుట్టుమచ్చలు వేరు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం బట్టి, అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఆధారపడి ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు ధనయోగం ఇచ్చే పుట్టుమచ్చల గురించి తెలుసుకుందాం.తలపై కుడి భాగంలోనూ, నుదురు మధ్య భాగంలో, కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కన్ను రెప్పపై, కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది.ముక్కు కుడి భాగంలోనూ, కుడి చెంపపై, చెవులపై,. నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయి అని శాస్త్రం విశ్వసిస్తోంది.
కుడి భుజం పైన, పొట్ట పైన,మెడ ముందు భాగంలో... హృదయ స్థానంలోను, మోచేతి పైన, కుడి అరచేతిపై, కుడి తొడపై, కుడి మోకాలుపై గల పుట్టుమచ్చలు వలన కాలం కలసి వచ్చినప్పుడు శ్రీమంతుల యోగం పట్టేలా చేసేవిగా చెప్పబడుతున్నాయి. మాడుకు ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే గ‌న‌క‌ మంచి తెలివితేటలతో పాటు వాక్ చాతుర్యం ఉంటుంది. వీరు తమ గురించే కాక సమాజం గురించి మరింత ఉన్నతంగా ఆలోచిస్తారని... సమాజం యొక్క అభివృద్ధి కోసం పాటుపడతారని మచ్చ శాస్త్రం తెలుపుతోంది. తలపై మాడు భాగానికి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే రాజకీయాల్లో రాణించే అవ‌కాశం ఉంటుంది. మంచి ఆలోచనాపరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందుచూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటానని శాస్త్రం చెబుతోంది.
ఇక కుటుంబ విషయానికొస్తే ,అణకువగల భార్య.. వినయం కలిగిన సంతానంతో వీరి జీవితం ఆనందంతో నిండి పోతుంది అని తెలుపుతోంది. పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది. కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వ్య‌క్తి సంపదలను కలిగి ఉంటాడు.మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులని నమ్మకం. ఇక స్త్రీల విషయానికి వస్తే తలపై పుట్టుమచ్చ అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వదనే చెప్పాలి. దూకుడుతనంతో... వీరి వ్యవహారశైలిని ఇతరులను బాధించే లా ఉంటుందని శాస్త్రం తెలుపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: