నమస్కారంలో ఉన్న పరమార్ధం ఏంటో తెలుసా...?

VAMSI
ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా వుంటుంది. అవి.. వారివారి సంస్కృతీసంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి వుంటుంది. అయితే.. ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది ఒక ప్రత్యేక శైలి. ఈ పలకరింపు శాస్త్రీయతతో మేళవించిన సంప్రదాయం. పెద్దవారిని చూడగానే చిన్నవారు చేతులు జోడించి నమస్కరించడం భారతీయులు చేసే పని. ‘నమస్కారం’లో ‘నమ’ అంటే వంగి వుండటం. అంటే.. పెద్దల ఎదుట అహంకరించకుండా ఉండడం.

అసలు ఎందుకు నమస్కరించాలి..? ప్రస్తుతరోజుల్లో ప్రతిఒక్కరు పలకరించుకునేవిధంగా ‘హాయ్’, ‘హలో’ అని చెప్పుకుంటే సరిపోతుంది కదా అనే సందేహం కలగవచ్చు. కానీ.. అలా చేయకుండా నమస్కారం ఖచ్చితంగా చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకు బలమైన కారణం కూడా వుంది. మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం. ధన, ఋణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం (సర్క్యూట్) పూర్తి అవుతుంది. మనిషి శరీరంలో అటువంటి ధృవాలు చేతి వ్రేళ్ళు. వాటిని కలపటం వల్ల సర్క్యూట్ పూర్తి అవుతుంది. విద్యుదయస్కాంత ఘటంలో విద్యుత్ చలనం మొదలవుతుంది. రెండు ఘటాలు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక దానిమీద ఉంటుంది. ఎక్కువ శక్తివంతమైన ఘటం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘటంలో ప్రకంపనలు కలుగుతాయి. అవి  సరిగా మేలు కలిగించే విధంగా ఉండటానికి చేసిన ఏర్పాటు ఈ నమస్కారం.

నమస్కరించటంలో కూడా ఎదుటివారిని బట్టి పద్ధతి మారుతుంది. దేవతలకు రెండు చేతులు సహస్రారంపై జోడించాలి. పెద్దలకు నుదుటిపై అంజలి ఘటించాలి. సాటి వారికి అభివాదం చేయటానికి రెండు చేతులను హృదయ స్థానంలో జోడించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆ స్థాయిలో గౌరవించదగిన వారింకెవరైనా వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. దీనినే దండప్రణామమ్ అని కూడా అంటారు. అంటే, కర్ర లాగా నేలమీద పడి ,ఎనిమిది అవయవాలు  భూమిని తగిలేట్టుగా నమస్కరించటం. స్త్రీలు పంచాంగాలతో చేస్తే సరి పోతుంది. స్త్రీల ఉదరం, వక్షస్థలం మనిషి అస్తిత్వానికి, పోషణకి నిలయాలు కనుక అవి నేలకు తగులరాదు. నిజానికి ఇలా చేయటం వల్ల నమస్కరించిన వ్యక్తికి ఎదుటివారి నుండి శక్తి ప్రసారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: