దుర్గా: భక్తులే పూజారులు.. విశాఖ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయం ప్రత్యేకతలు.. తెలుసుకుని తీరాల్సిందే.?

Arshu
విశాఖపట్నంలోని ఆలయాలలో ప్రముఖమైనది కనకమహాలక్ష్మి ఆలయం. బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయం క్రిందటి శతాబ్దం పూర్వార్ధంలో వెలుగులోకి వచ్చిందని ప్రతీతి. కనకమహాలక్ష్మి విశాఖ పాలకుల ఇలవేలుపు. విశాఖ వాసులకే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గత శతాబ్ద కాలంగా ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విశాఖ నగరం నడిబొడ్డున కొలువు ఉన్నారు. నేడొక ప్రముఖ పట్టణంగా గుర్తింపబడిన విశాఖ వంద సంవత్సరాల క్రిందట ఒక చిన్న ఊరే ! శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు విశాఖపట్నంలో భక్తుల నీరాజనాలతో విలసిల్లుతున్నది. భక్తులపాలిట కల్పవల్లిగా ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలువబడుతోంది. 


శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారిని సత్యంగల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, స్త్రీలకు ఐదవ తనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింపచేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూంటారు. మరి ఈ ఆలయ చరిత్ర .మహిమలు.. విశేషాలేంటో.. తెలుసుకుందాం..శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఇతర దేవాలయాలలో వలె కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో మనకు దర్శనమిస్తుంది. ఇదీ ఈ అమ్మవారి ప్రత్యేకత. సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజులపాలనలో ఉండేదని, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు నాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని తెలుస్తోంది.

విశాఖ రాజుల కోట బురుజు ఈ పరిసరాల్లో ఉండేదని, అందుచేతనే ఈ ప్రదేశాన్ని బురుజుపేట అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. ఈ అమ్మవారు స్వయంభు: .ఆశ్చర్యకరంగా ఇక్కడ అమ్మవారికి ఎడమచెయ్యి సగం వరకే ఉంది. మరో విషయం ఏమటంటే అమ్మవారి పైన గోపురం లాంటిది ఏమి ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిరాలు ఏర్పాటు చేస్తారు . ఇక్కడ భక్తులే స్వయం గా పూజలు చేయవచ్చు. పసుపు, కుంకుమా చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తున్నారు. పూజారులు ఎవరు ఉండరు, భక్తులే స్వయంగా పూజలు చేసి నమస్కరించి భయటకు వస్తారు.

ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరికి వారే ఆ అమ్మను కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు ,కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా మారారు. అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటు. అలాగే అరుదుగా అమ్మవారిని భక్తులే నేరుగా పసుపు కుంకుమలు, పాలు పవిత్ర జలాలతో పూజలు చేసే ఆచారం ఈ సన్నిధానంలో సాగటం మరో విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: