కనుమ: చికెన్.. మటన్ ముక్కల పండగ...!
ఇది చాలామందికి ప్రీతికరమైన రోజు. కారణం… ఈరోజు అంతా తినడం, తాగడం, విందులు, వినోదాల ప్రత్యేకం ఎంతో ప్రత్యేకంగా చేస్తారు. ముఖ్యంగా మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపటానికి జరుపుతారు. అంతేకాక కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది. కనుమ నాడు మినుము తినాలనేది సామెత కూడా ఉంది. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తూంది. మాంసాహారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకా హార మాంసంగా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం. కనుమ అంటేనే మాంసాహారానికి ప్రత్యేకమైన పర్వం. ఈ రోజు మాంసాహార ప్రియులు ఖచ్చితంగా మాంసాహారం తీసుకోవాలి. అయితే, ముందుగా అంతో ఇంతో పేదలకు దానం చేసి.. తర్వాతే తీసుకోవాలని పెద్దలు చెబుతున్నారు.
ఇక ఈ కనుమరోజు మొత్తం చుట్టాలందరినీ పిలిచి భోజనాలు కూడా పెడతారు. మటన్, చికెన్ ఇంకా చేపలు ఇలా రకరకాల వంటలు చేసుకుంటారు. ఆ రోజంతా ఫుల్‌గా నాన్‌వెజ్‌లో మునిగి తేలుతారు.