వినాయకుడు మోదకప్రియుడే కాదు గుంజిళ్ల ప్రియుడు కూడా. దేవాలచయాలలో కాని ఇంట్లో కాని వినాయకుని ఎదురుగా నిల్చుని ‘‘ చేసిన తప్పులను మన్నించు తండ్రీ ! వినాయకా! ’’ అంటూ గుంజిళ్లు తీసి, లెంపలు వాయించుకుంటే ఆ వినాయకుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.
ఒకసారి విష్ణుమూర్తి పరమశివుని కోసం కైలాసానికి వెళ్లాడు. అక్కడున్న వినాయకుని వద్ద విష్ణువు తన సుధర్శన చక్రాన్ని ఉంచి లోనికి శివుని దగ్గరకు వెళ్లి మరల తిరిగి వచ్చేసరికి ఆ చక్రాన్ని వినాయకుడు నోట్లో పెట్టుకుని ఎంత ఇవ్వమని అడిగినా ఇవ్వలేదట. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ చక్రాన్ని తీసుకోవడం కుదరలేదు.
అప్పుడు విష్ణుమూర్తి వినాయకుని ఎదురుగా నిల్చుని గుంజిళ్లు తీయగా వినాయకుడు పకపకా నవ్వాడట. అప్పుడు వినాయకుని నోట్లోంచి ఆ సుదర్శనచక్రం కింద పడబోగా దానిని విష్ణువు అందుకొన్నాడట. ఆవిధంగా విష్ణువు గుంజిళ్లు తీయడం ద్వారా తనకు కావలసిన దానిని వినాయకుని నుండి పొందినట్లే మనము కూడా వినాయకుని అనుగ్రహం కోసం గుంజిళ్లు తప్పనిసరిగా తీయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: