అదృష్టం వేరు, కష్టం వేరు, అదృష్టముంటే అదే వచ్చి వరిస్తుంది. క్షీరసాగర మధనంలో సకల సంపదలకీ మూల స్వరూపిణి అయిన శ్రీమహాలక్ష్మీ జన్మించింది. శ్రీమహావిష్ణువుని వరించింది.
అలాగే అదే క్షీరసముద్రంలో జనియించిన విషమును శివుడు గ్రహించి గరళకంఠుడు అయ్యాడు. దాన్నేమంటారు.... ప్రాప్తమా, అదృష్టమా, దురదృష్టమా, అవేమి కావు. శ్రీమహావిష్ణువుది ప్రాప్తం కాదు. కష్టం.
అకుంఠిత దీక్ష నాయకత్వ లక్షణము. దేవరాక్షసులని ఒక్కటిగా చేశాడు. అమృతాన్ని ఎలా పొందాలో చెప్పాడు. కూర్మావతారమెత్తి మంధర గిరిని మోశాడు. అంత కష్టం చేశాడు కాబట్టే శ్రీమహాలక్ష్మీ తనకై తనే అందర్నీ దాటుకుంటూ వెళ్ళి శ్రీమహావిష్ణువును వరించింది. వక్షస్థలంలో స్థిర నివాసం ఏర్పరుచుకుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: