2016 సంవత్సరం : మిథునరాశి జాతక ఫలితాలు..!


2016 సంవత్సరం ఫలితాలు మిథునరాశి


మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర  1,2,3,4 పాదములు, పునర్వసు : 1,2,3వ పాదములు

పేరులోని మొదటి అక్షరములు – కా,కీ,కూ,ఖం,జ్ఞ,చ్చ,కే,కో,హా పుట్టిన రోజు - మే 21st నుండి జూన్ 20th


సంబంధిత  కాలం
ఆదాయం
వ్యయం
రాజపూజ్యం
అవమానం
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
11522
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
14117 7

ఈ రాశి వారికి బుద్ది, ధనము, కుటుంబ కారకుడైన గురువ, బలీయంగా ఉండుట, శని కుజుడు, రాహువులు కూడా బలంగా ఉండుట చేత ఉన్నతస్థితికి రాగలరు. యోగ ప్రభావం హెచ్చును. ధనాదాయం చాలా బాగుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయ నూతన గృహలాభములు, కట్టడములు, గృహములో వివాహాది శుభ కార్యములు ఆనందంగా జరుగును. నూతన బాంధవ్యములు, పుణ్య క్షేత్రాలకు వెళ్లుట, వాహన లాభము, మనస్సుకు సంతోషమైన పనులు చేయుట, తమ యొక్క మాట చమత్కృతి, యుక్తి ప్రభావం చేత ఎంతటి వారలైన లోబరుచుకొనుట కలుగును. గత సంవత్సరం కంటే విషేశ యోగం అనుభవిస్తారు. స్త్రీప్రమేయం తో ఎంతటి ఘనకార్యమైనా సాధిస్తారు. మీ ఆడవారి చేతితో డబ్బు తీసుకొని నడిపించేది. గతంలో ఉన్న జీవితాశములు నెరవేరును. లోగడ చేసిన రుణబాధలు తొలుగును. దైవీకమైన శక్తి, బలము ఒక విధమైన ఆత్మీయత కలిగించును. శని బలం వలన ఎంతటి కార్యన్నైనా సాధింగలరు. ఆత్మీయత కలిగించును.  స్త్రీ జనమూలకసంతోషము. కుటుంబ సంరక్షణ, నూతన కార్యాకలాపాలు ప్రారంభం, బంధు వర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగును. స్థిరాస్తిలో మార్పులు భూ గృహోదాలు వలన తగిన ఆదాయం చేకూరును. ఆ ప్రయత్న ధనలాభం.


మొత్తం మీద ఈ రాశి, స్త్రీ,పురుషాదులకు మంచి యోగ కాలంగా చెప్పవచ్చును. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ యొక్క సామర్థ్యములు, తెలివితేటలకు తోడుగా గ్రహబలంతో తోడవటం చేత మీకు ఎదురు లేకుంవా పోతుంది.  


మృగశిర  3,4,పాదములు వారు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండును. పరిస్థితులు సంతృప్తి కరంగా ఉంటాయి. విదేశీ వ్యవహారములు లాభించును. శుభవార్త అందుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మానసిక ఉల్లాసం పొందుతారు.

శాంతులు:  గురునికి జపములు, శుక్రునికి శాంతులు


ఆరుద్ర 1,2,3,4 పాదముల వారు : చేయు కార్యముల యందు ఇతరుల జోక్యం పెరుగును. ఎదుటి వారు మనసు  నొప్పించకుండా పనులు చక్కబెట్టుకోవాలి. వృత్తి లో వత్తిడులు, ఇబ్బందులు జాగ్రత్తగా ఎదుర్కొవలసి ఉంటుంది. ధైర్య సాహసాలకు , తల్లిదండ్రుల దీవెనలు గెలిపిస్తాయి.

శాంతులు : రాహు, కుజులకు జపములు, శని, బుధ, కేతువులకు శాంతులు


పునర్వసులు 1,2,3, పాదముల వారు : వస్తు, వస్త్రా ,వాహన, ఆభరణ లాభములు పాందుదురు. మీ యొక్క ప్రవర్తలో అందరికీ ఆదర్శంగా ఉంటారు. కళారంగంలో ఆకస్మిక, ప్రోత్సాహం పెరుగుతాయి. సమస్యలు పరిష్కరించుకోని, విజయాన్ని సొంతం చేసుకుం టారు.

శాంతులు : కేతువకు జపములు : కుజ, రాహు, శుక్ర,చంద్రులకు శాంతులు

               2016  


మిథున రాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు


January

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

February

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

March

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

April

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

May

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

June

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

July

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

August

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

September

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

October

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

November

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

December

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31


జనవరి2016 : ఆస్థి వివాదాలు పరిష్కారం, శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు.


ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గ్రహస్థితి దృష్ట్యా యోగించే కాలం. మీ సృజనాత్మక, ప్రతిభా పాఠవాలు, తెలివి తేటలు అనుభవానికి తగిన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వారం మధ్య నుంచి కొంత ప్రతికూల గ్రహస్థితి సూచిస్తుంది. వాహనాలు, భూములు, స్థలాలు, కొనుగోలు జేస్తారు.


పారిశ్రామిక వర్గాల వారికి అన్ని విధాల ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్థి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగంలో మార్పులు సూచిస్తున్నాయి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్త వహించండి. నిత్యం గృహములో అష్టమూలికా గుగ్గిలం తో ధూపం వేయుట మంచిది.


పరిష్కారములు : రవి, కుజ, గురు, శుక్ర, రాహు, కేతు గ్రహములకు శాంతులు.


ఫిబ్రవరి2016 : సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు.


అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గ్రహస్థితి దృష్ట్యా యోగించే కాలం. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉంటుంది. కోర్టు కేసులు వాయిదాలు పడటం కొంత ఇబ్బంది కలిగించినా ఓర్పు వహించండి. అంతిమ విజయం మీదే. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.


కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగపరంగా శ్రమ అధికం అవుతుంది.  ఆధ్యాత్మిక చింతన కలిగి యుంటారు. ఓం నమోః నారాయణ వత్తులు వెలిగించండి.


పరిష్కారములు : రవి, కుజ,బుధ, గురు, శుక్ర, కేతు  గ్రహములకు శాంతులు.


మార్చి2016 : మీ పేరును, పలుకు బడిని, హోదాను పొందుతారు.


దీర్ఘ కాలంగా తీరకుండా ఉన్న సమస్యలపై ఈ వారము దృష్టి సాధిస్తారు. ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహస్థితి దృష్ట్యా యోగించే కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దానధర్మాలు చేస్తారు. శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పలుకుబడికలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వీటిని మీరు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నాలు చేస్తారు. మీ పేరును, పలుకు బడిని, హోదాను పొందుతారు.


గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. రుణాలు తీరి ప్రశాంతతను పొందుతారు. పారిశ్రామిక రంగంలోని వారికి అనుకూలం. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మితిమీరిన మంచితనం పనికిరాదు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.తెల్లజిల్లేడు వత్తులతో క్ష మహా గణపతి దీపారాధన చేయండి.


పరిష్కారములు : రవి, గురు, కేతు  గ్రహములకు శాంతులు.


ఏప్రిల్2016 : చాకచౌక్యంగా శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు.


ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాకచౌక్యంగా శత్రువులను సైతం మిత్రులుగా మార్చు కుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. గ్రహస్థితి దృష్ట్యా యోగించే కాలం.  స్థిరాస్తి వ్యవహారాల్లో స్థబ్దత నెలకొంటుంది. శుభకార్యములను ఖారారు చేస్తారు. వివాదాలకు , కోపతాపాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పదోన్నతి పొందే యోగం.


మిమ్మల్ని దెబ్బతీయాలని శత్రువర్గం చేసే యత్నాలు ప్రారంభంలోనే విఫలం అవుతాయి. శుభకార్యాలు మానసిక ప్రశాంతతకు కారకమవుతాయి. వృత్తి, ఉద్యోగాల పట్ల చెప్పుకోదగిన మార్పులు గోచరించడం లేదు. లక్ష్మీ తామర వత్తులతో మహాలక్ష్మీ వద్ద దీపారాధన చేయండి.


పరిష్కారములు :   గురు, శుక్ర, కేతు  గ్రహములకు శాంతులు.


మే 2016 : వృత్తి, ఉద్యోగాలు మీకు ఆశించిన స్థాయిలో ఉంటాయి.


పురోగాభివృద్ది లో కొంచెం మందగమనం ఏర్పడుతుంది. మే మాసం మీకు మేలు చేస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విదేశీ యత్నాలు ఫలిస్తాయి. మద్యవర్తిగా వ్యవహరించి ఇరువర్గాల మద్య సఖ్యతకు పాటు పడ్తారు. వృత్తి, ఉద్యోగాలు మీకు ఆశించిన స్థాయిలో ఉంటాయి. కుటుంబ ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.


ఆర్థిక పరిస్థితి అంతంగ మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని పరిశీలించి చేయడం చెప్పదగిన సూచన. శారీరకముగా, మానసికముగా పనిభారం అధికమవుతుంది. గృహ, వాహన కోనుగోలు విషయాలలో నిదానం అవసరం. లక్ష్మీ చందనము తో మహాలక్ష్మి ని పూజించండి. ధరించండి.


పరిష్కారములు : గురు, కేతు  గ్రహములకు శాంతులు.


జూన్ 2016 : నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలం.


చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు కంపెనీలలో కూడా మంచి అవకాశాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ది సాధిస్తారు. రుణాలు కొంత వరకు తీరుస్తారు. గ్రహస్థితి దృష్ట్యా యోగించే కాలం.


ఉద్యోగంలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి వాహనాల విషయంలో కొంత మెలకువ అవసరం. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. శ్రమ అధికమవుతుంది. క్రీడారంగమందు ఆసక్తి కలిగి ఉంటారు. నరదృష్టి అధికంగా ఉంది.  కీలక నిర్ణయాలలో తొందర పాటు తగదు. రాజకీయ పదవులు సంప్రాప్తిస్థాయి. గృహంలో దైవికంతో పొగ వేయండి.


పరిష్కారములు : రవి,   గురు,  కేతు  గ్రహములకు శాంతులు.


జూలై2016 : షేర్లు, భూముల క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి.


ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి స్థలాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గ్రహస్థితి దృష్ట్యా యోగించే కాలం. ఆకస్మిక ధన లాభం పొందుతారు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి.


మీ తొందర పాటు వల్ల మిత్రులతో శతృత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. నిత్యం రుద్రకవచంర పఠించడం వలన మేలు జరుగుతుంది. సౌరకంకణం ధరించండి, ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు.


పరిష్కారములు : రవి, కుజ,బుధ, గురు, కేతు  గ్రహములకు శాంతులు.


ఆగష్టు 2016 : సంతానం, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.


నూతన ప్రయత్నాలు పురోగతి సాధిస్తారు.  ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. స్థలాలు కొనుగోలు చేస్తారు.


వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకర పరిస్థితి. సంతానం, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు సానుకూల పడతాయి. గ్రహస్థితి దృష్ట్యా యోగించే కాలం. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం.  అష్టమూలికాతైలంతో దీపారాధన చేయండి.


పరిష్కారములు : రవి, బుధ, గురు,  కేతు  గ్రహములకు శాంతులు.


సెప్టెంబర్ 2016 : సంతాన, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విద్యలయందు ఆసక్తి చూపిస్తారు.


ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. గృహం కొనుగోలు యత్నాలు సాగిస్తారు. మనో నిబ్బరంతో ముందడుగు వేసి ముఖ్యమయిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. రుణబాధల నుంచి బయట పడతారు. సంతాన, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.


నూతన విద్యలయందు ఆసక్తి చూపిస్తారు. చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి అవుతాయి. కొంచెం నిదానంగా వ్యవహరించడం మంచిది.   ఈ వారం 1-9-216 సూర్య గ్రహణం. గ్రహణ దోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 27 రోజున లోపు చేయించాలి మరియు శివాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి. శక్తి లేని వారు స్తోమతను బట్టి దక్షిణ సమర్పించుకోవాలి.


పరిష్కారములు : రవి, కుజ,బుధ, గురు, శుక్ర, కేతు  గ్రహములకు శాంతులు.


అక్టోబర్2016 : క్రయ విక్రయాలల్లో లాభాలు పొందుతారు.


ఆర్ధిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. నూతన పెట్టుబడులకు అనువైన కాలం. మీలోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. గృహనిర్మాణాల ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థి, విద్యార్థినులు పోటీ పరిక్షలలో విజయం సాధిస్తారు.


క్రయ విక్రయాలల్లో లాభాలు పొందుతారు. దూర ప్రాంతాము నుంచి శుభవార్తలు వింటారు. గ్రహస్థితి దృష్ట్యా యోగించే కాలం. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. భూ వివాదాలకు దూరంగా ఉంటాలి. దైవికం పొగ వేయండి. చిన్న పిల్లలు ఉన్న గృహానికి మంచిది.


పరిష్కారములు : రవి, కుజ,బుధ, గురు కేతు  గ్రహములకు శాంతులు.


నవంబర్2016 : ఆదాయ, వ్యవయాలు సరిసమానంగా ఉంటాయి.


ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి. వాయిదా పద్దతులతో వస్తువులు కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తారు. వాహనసౌఖ్యం, భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.


ఆదాయ, వ్యవయాలు సరిసమానంగా ఉంటాయి. పుణ్య క్షేత్రాలు దర్శిస్తారు. కొనుగోలులో మెలకువలు పాటించండి. నిత్యము కప్పు సాంబ్రాణిని వెలిగించటం చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవి, కుజ,బుధ, గురు, శుక్ర, కేతు  గ్రహములకు శాంతులు.


డిసెంబర్ 2016 : కీలక నిర్ణయాలు స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.


ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సుదూర ప్రాంతములలోని మీ ఆత్మీయుల సహయ సహకారాలు అందుకుంటారు. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. కీలక నిర్ణయాలు స్వంత ఆలోచనలు శ్రేయస్కరం. ఉద్యొగస్తులకు అనుకూలంగా ఉంటుంది.  వాహన సౌఖ్యం లభిస్తుంది.


వృత్తి వ్యాపారాలలో మార్పులు ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మానసిక, శారీరక శ్రమ అధికమవుతుంది. నిత్యం నాగసిందూరము ధరించండి. గ్రహస్థితి దృష్ట్యా యోగించే కాలం.


పరిష్కారములు : కుజ,బుధ, గురు, శుక్ర, కేతు  గ్రహములకు శాంతులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: