మనిషికి దైవశక్తి అంటే మహానమ్మకం..దైవ బలం ఉంటే ఏదైనా సాధిస్తాం అన్న నమ్మకం ఉంటుంది. హీందూ దేవుళ్లు, దేవతలు చాలా మంది ఉన్నారు..ముఖ్యంగా శివుడు బాగా కొలవబడతాడు..వాస్తవానికి శివుడికి రూపం లేకున్నా లింగాన్ని మహాభక్తితో పూజిస్తాం..శివుడికి రూపం మహాలింగమే.. అలాగే సిద్దులు, పురాణ పురుషులు మహా మహిమాన్వితులు ప్రతిష్ట చేసిన లింగాలను ను పూజించిన మంచి ఫలితం ఉంటుంది.
మన దేశంలో పాదరస శివ లింగము ఉన్న ఒకే ఒక దేవాలయము ఉజ్జయినిలో సిద్దాశ్రమము, ఇక్కడి శివ లింగము బరువు సుమారుగా 1500 కిలో గ్రాములు. ప్రపంచములొ ఎక్కడా ఇటువంటి శివ లింగము లేదు అంటారు. భక్తులు ఈ లింగాన్నీ తాకి దర్శనం చెసుకొవచ్చు. మనిషిలొని నేగటివ్ ఏనర్జీ తగ్గించె శక్తి ఈ లింగముకు ఉన్నది. ఈ శివ లింగమునకు కొంత సేపు తల ఆన్చితే తలలొ నరాలకు సంభందించిన వ్యాదులు నయమవుతాయి అని అక్కడి వారి నమ్మకం. స్వయంభూ లింగార్చన కుడా. లింగాలలో అనేక రకాలు ఉన్నాయి.
శివలింగాని పూజలు చేస్తూ..
ఏ పూజిస్తే వివిధ రకాల కామ్యాలు సిద్ధిస్తాయి అంటారు మరి ఆ లింగాలు ఏమిటో చూద్దామా..!
వజ్ర లింగాన్ని పూజిస్తే అయుహ్ వృద్ధి
ముత్యం లింగాన్ని సేవించటం రోగనాశకరం
పద్మ రాగ లింగం లక్ష్మి ప్రాప్తినిస్తుంది
పుష్య రాగం లింగాన్ని పూజిస్తే యశస్సు.
నీలం లింగం అయుహ్ వృద్ధి
మరకత లింగం పూజ సుఖ ప్రాప్తి.
స్పటిక లింగార్చన సర్వ కామనలను సిద్ధింపజెస్తుంది
లోహ లింగపూజ శత్రు నాశనాన్ని చెస్తుంది
ఇతడి లింగార్చన తేజసు ఇస్తుంది
గంధం లింగార్చన స్త్రీలకు సౌభాగ్యాన్నిస్తుంది.
వెన్న లింగం మొక్షాన్నీ ప్రసాదిస్తుంది.
ధాన్యపు పిండితో చేసిన లింగార్చన వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.
ఇలా రక రకాల లింగార్చనల వల్ల రకరకాల ఫలితాలు ఉన్నాయి.
ఆంటే పాదరసం ఉన్న లింగానికి అభిశెకమ్ చేసి ఆ తీర్థం సేవిస్తే సర్వ వ్యాదులు నాశనం అవుతాయని ప్రసిద్ధి .