స్మరణ: హరికృష్ణ రాజకీయ జీవితం...

frame స్మరణ: హరికృష్ణ రాజకీయ జీవితం...

VAMSI
నందమూరి వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు ప్రజల ఆదరణ మరియు అభిమానాన్ని పొందిన వారే. ఇది ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుండి ఇప్పుడు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వరకు కొనసాగుతూ ఉంది. ఈ రోజు స్మరణలో భాగంగా ఎన్టీఆర్ కుమారుడు అయిన నందమూరి హరికృష్ణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
హరికృష్ణ ఎన్టీఆర్ కు మూడవ బిడ్డ. ఈయన 2 సెప్టెంబర్ 1956 వ సంవత్సరంలో నిమ్మకూరు కృష్ణ జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుండి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన భావాలను పుణికిపుచ్చుకున్నాడు. ఆనాడు ఎన్టీఆర్ ఒక సినిమా నటుడిగా కొనసాగుతూనే రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి ఒక ప్రభంజనం లా దూసుకువెళ్ళాడు. ఆ విధంగా తెలుగు దేశం పార్టీ స్థాపించబడింది. హరికృష్ణ తండ్రి వెంటే ఉంటూ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ ఉన్నారు. ఇలా తన రాజకీయ జీవితంలో భాగంగా హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా, శాసన సభ్యుడిగా మరియు రాజ్యసభ సభ్యుడిగా తన సేవలను అందించాడు.


అలా అంతా సజావుగా సాగుతున్న సందర్భంలో అప్పటికే తెలుగు దేశం పార్టీలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నందమూరి వంశం నుండి పార్టీని తన చేతుల్లోకి లాక్కోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సొంత పార్టీ నాయకులతో ఎన్టీఆర్ పై తిరగబడేలా చేశారు. అప్పుడు 1995 వ సంవత్సరం టీడీపీ తీవ్ర కష్టాల్లో ఉంది. అటువంటి సమయంలో ఎన్టీఆర్ ను అందరూ వెన్ను పోటు పొడిచారు. అయితే దేనికీ అంతా బాధపడని ఎన్టీఆర్ సొంత కొడుకు కూడా చంద్రబాబు వైపే నిలబడడంతో తట్టుకోలేకపోయాడు. అందరి సాయంతో చంద్రబాబు సీఎం అయ్యాడు. కానీ ఇదే దిగులుతో మరియు అనారోగ్యంతో ఎన్టీఆర్ మరుసటి సంవత్సరమే కన్ను మూశారు. అయితే హరికృష్ణ ఆనాడు తండ్రికి వ్యతిరేకంగా ఎందుకు నిలబడ్డాడో తెలియదు. మళ్లీ మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు కు హరికృష్ణకు పడలేదు, రాజకీయ విబేధాలు తలెత్తాయి. వెంటనే అన్న తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టినా అది ఆదరణకు నోచుకోలేదు.


ఇక వేరే చాన్స్ లేక మళ్లీ  టీడీపీలోకి వెళ్ళాడు. ఇలా తన రాజకీయ జీవితంలో ఏనాడూ సరైన నిర్ణయం తీసుకోలేదు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఉండడంలో ఫెయిల్ అయ్యాడు. అత్యవసరమైన సమయంలోనూ తండ్రికి సపోర్ట్ గా నిలబడలేకపోయాడు. చంద్రబాబు కుట్రను తెలుసుకోలేక తండ్రి చావుకు పరోక్షంగా కారణమయ్యాడు. అలా చాలా కాలం పాటుగా రాజకీయాల్లో కొనసాగాడు. హరికృష్ణ తాను. హనిపోయే ముందు వరకు టీడీపీ బ్యూరో సభ్యుడిగా కొనసాగాడు. 29 ఆగస్ట్ 2018 వ తేదీన స్నేహితుడి ఇంట్లో పెళ్లి కోసమని వెళుతుండగా నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: