స్మరణ: జయప్రకాష్ రెడ్డి గురించి తెలియని విషయాలివే ?
అలా దాదాపుగా నాలుగు సంవత్సరాలు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అయితే వచ్చే రాబడి సరిపోక సినీ జీవితానికి పుల్ స్టాప్ పెట్టేశాడు. తిరిగి మళ్ళీ గుంటూరు వెళ్లి టీచర్ గా చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఒకసారి ఎదో పని మీద హైదరాబాద్ రావడం రామానాయుడు కలవడం జరిగిపోయింది. అప్పుడు మళ్ళీ ప్రేమించుకుందాం రా సినిమాలో విలన్ పాత్ర ఇచ్చాడు. ఇక అది మొదలు వరుసగా హిట్ సినిమాల్లో విలన్ గా చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాడు.
తర్వాత కమెడియన్ కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన టీచర్ గా ఉన్న సమయంలో ట్రాన్స్ఫర్ లు ఎక్కువగా ఉండడంతో దాదాపు అన్ని జిల్లాల యాసలను సులభంగా నేర్చుకున్నాడు.
ఈ రోజుకి కూడా ఎంతో మంది ఎక్కడ మిమిక్రీ ప్రోగ్రామ్ జరుగుతున్నా జయప్రకాష్ రెడ్డి గురించి ఖచ్చితంగా మిమిక్రీ చేస్తుంటారు. అంతలా తన వాయిస్ తో మ్యాజిక్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ సెప్టెంబర్ 8 2020 గుంటూరు లోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించాడు. ఇది ఎంతో మంది ప్రేక్షకుల్ని కలచివేసింది.