యల్లాప్రగడ సుబ్బారావు
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ
గోదావరి, భీమవరం పట్టణంలో
జనవరి 12, 1985 న ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన
తండ్రి జగన్నాథం గుమస్తాగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కానీ ఆయన సుబ్బారావు చిన్నతనంలోనే చనిపోవడంతో వారి కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కానీ తల్లి మాత్రం సుబ్బారావును పెద్ద చదువులు చదివించాలని పట్టుబట్టి అతడిని మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అనంతరం ఇంటర్మీడియట్ పూర్తి చేసి రామకృష్ణమఠం వారి సహకారంతో మద్రాసు మెడికల్ కాలేజి నుండి పట్టభద్రులైయ్యారు.
ఐతే తన పెద్దన్నయ్య పురుషోత్తం, తమ్ముడు
కృష్ణమూర్తిఇద్దరు కూడా ఎనిమిది రోజుల వ్యవధిలోనే "స్ఫ్రూ" వ్యాధితో చనిపోయారు. తన కళ్ళ ముందే తన తొడబుట్టిన వారు చనిపోతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న యల్లాప్రగడ సుబ్బారావు ప్రాణాంతక వ్యాధులకు ఎలాగైనా మందు కనిపెట్టాలని దృఢంగా నిర్ణయించుకున్నారు.
ఛారిటీ సంస్థల ఆర్థిక సహాయంతో అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లిన సుబ్బారావు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ పై చదువుల నిమిత్తం డబ్బులు పోగు చేసుకొని ‘హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్’లో చేరారు. మెడిసిన్‌లో
డిప్లొమా సంపాదించిన ఆయన ఓ పరిశోధనాశాలలో అసిస్టెంట్‌గా చేరి మరో శాస్త్రవేత్త సైరన్ ఫిస్కీతో కలిసి.. ఫాస్ఫోక్రియెటైన్, ఎడినోసైన్, ట్రయోఫాస్ఫేట్ రసాయనాలు మానవ శరీరంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో పరిశోధనలు చేశారు. దీంతో ఆయనకు పి.హెచ్.డి పట్టా లభించింది.
తదనంతరం లెడర్లీ పరిశోధనాలయంలో జాయిన్ అయ్యి 1945 జూలై 20న ఫోలిక్ యాసిడ్ నుండి బంగారు వన్నె భస్మాన్ని కనుగొన్నారు. ఇది ఆపోడి స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా వంటి రక్తహీనత వలన వచ్చే వ్యాధుల నిర్మూలనకు అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. అయితే తన అన్నదమ్ములను బలిగొన్న వ్యాధులకు అద్భుతమైన మందులు కనుగొన్నందుకుగాను సుబ్బారావు ఎంతో సంతోషించారు.
ఆయన విటమిన్ బి9ను, క్యాన్సర్ వ్యాధిని నిరోధించే మెథోట్రెక్సేట్‌ను, దోమకాటు వల్ల సంక్రమించే బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం వంటి వ్యాధుల నివారణకు వాడే హైట్రాజన్ను కూడా కనిపెట్టారు. అంతేకాదు
క్షయ రోగానికి శాశ్వతమైన బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనిపెట్టారు. ఐతే ప్రజలకు ప్రాణాంతక రోగాల నుంచి విముక్తి కలిగించేందుకు తన జీవితం మొత్తం వైద్య పరిశోధనలకే అంకితమిచ్చిన సుబ్బారావు 'కరోనరి త్రాంబసిన్' వ్యాధితో 1948 ఆగష్టు 9వతేదిన అమెరికాలో తన తుది శ్వాస విడిచారు. వైద్య రంగానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి.