గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

RATNA KISHORE
క‌ళ్లెదుట ర‌క్తం
అయినా స్పందించం


నిర్భాగ్యురాలు ఆమె
అయినా ఆదుకోం


ఒంట‌రిగా ఉన్నా ప‌ది మందిలో ఉన్నా
 అనుకోని తీరులో హ‌త్య
అయినా నిలువ‌రించ‌లేం



మేం చ‌చ్చాక కూడా మారబోం
క‌ళ్లెదుటే ఆమెను చంపాక కూడా మార‌లేం



స్వ‌తంత్ర భార‌తావ‌నీ! త‌ల‌దించుకో!
కాకుంటే లేదంటే
మ‌ళ్లీ మా రెప్ప మాటు క‌ల‌లు అలానే
క‌ల‌వ‌రిస్తూనే ఉంటాయి మంచి కోసం
మాన‌వ‌త్వం కోసం



ఫ‌స్ట్ కాజ్ : పాత గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని ర‌మ్య హ‌త్యోదంతంకు సంబంధించి రాస్తున్న క‌థ‌నం ఇది. క‌ళ్లెదుట ఘ‌ట‌నలు మ‌న‌లో ఏ కొద్ది మార్పూ తీసుకు రావాని చెబుతూ ఆవేదన చెందుతూ రాస్తున్న వాక్య‌మిది.



మీకూ అండ్ మీ రాజ‌కీయాల‌కు ఓ న‌మ‌స్కారం న‌క్కా ఆనంద్ బాబు..మీకూ మీ రాజ‌కీయాల‌కూ ఓ న‌మ‌స్కారం మిగ‌తా పార్టీల నాయ‌ కులూ.. ఇవ‌న్నీ వ‌దిలేయండి..మ‌నుషులం కదా! మామూలుగా అయినా స్పందించాలి. మ‌నుషులం క‌దా కాస్త‌యినా మాన‌వత్వంతో కూడిన గొంతుకల‌తో మాట్లాడాలి. ర‌క్త‌పు మ‌డుగులో విగ‌త జీవి..మీకు ప‌ట్టింపు ఉండ‌దు. స్థానికులంతా సినిమా చూస్తున్నారు . క‌నీ సం నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయలేని చేత‌గానిత‌నం అక్క‌డున్న వారిది. ఇంకేం అడిగేవాడు లేడు అడ్డుకునే వాడు లేడు.. సీసీ టీవీ ఫు టేజ్ లో ఓ వృద్ధురాలు నిందితుడ్ని నిలువ‌రించిన ఘ‌ట‌న ఉన్నా  ఆమె పూర్తి స్థాయిలో స‌ఫ‌లీకృతం కాలేకపో యింది.



మ‌న అస‌హాయ‌త,మ‌న‌లో చేత‌గానిత‌నం కొన్నిసార్లు విలువ‌యిన ప్రాణాలను హ‌రించి వేస్తుంది. మ‌నుషులంతా స్పందించ‌కుండా ఉంటే ఏ నిస్స‌హాయ‌తో  ఆవ‌రించి  క‌ద‌ల‌నీయ‌కుండా చేస్తుంది. కార‌ణాలు వెతికే ప‌ని ఇప్పుడు పార్టీలు చేయ‌డం కాదు చుట్టూ ఉన్న‌ వారూ చే య‌డం కాదు. మ‌నం మ‌న ప‌రిధిలో ఏ అన్యాయాన్ని ఆప‌గ‌లిగేం. ఏ అధ‌ర్మాన్ని అడ్డుకోగ‌లిగేం. ఏం అకృత్యాన్ని మ‌నం నిలువ‌రించి విజ‌ యులం కాగ‌లిగాం. ఈ త‌ర‌హా ఆలోచ‌నే లేన‌ప్పుడు, ఇలా ప్ర‌శ్నించుకోలేన‌ప్పుడు మానవ స‌మూహం ఇంకొన్ని గాయాల‌ను మోయాలి. ఈ చ‌రిత్ర ఏ సిరాతో అని రాసుకోడం మిన‌హా మ‌నమేం చేయ‌లేం..



పంద్రాగ‌స్టు వేళ మ‌నం ఆనందాలు చిందించాం. దీపాలు వెలిగించాలి. త‌ల్లీ నీకు జేజేలు ప‌లికాం. నిద్రాణ‌వ‌స్థ‌లో ఉన్న స‌మాజం మాత్రం ఎ ప్ప‌టికీ మేల్కోదు మేల్కున్న విధంగా న‌టించ‌డం క‌ర్త‌వ్యం పాటించిన విధంగా న‌టించడం త‌ప్ప ఏమీ చేత‌గాని స్థితి ఈ స‌మాజానిది. ద‌ ళిత యువ‌తి అని రాయ‌డంలో  ఏం అర్థం ఉంది. అక్క‌డ కుల ప్ర‌స్థావ‌న క‌న్నా మాన‌వ జాతి ఓడిపోయిన నైజ‌మే లెక్క‌కు మిక్కిలి బాధ‌ కు సంకేతం. అయినా ఈ మిగులు బాధ‌ను ఈ మిగులు దుఃఖాన్నీ మీరు మ‌రో  పంద్రాగ‌స్టు వ‌ర‌కూ మోయాలి..లేదా జ‌ న్మాంతం ఇది దుఃఖంగానే ఉన్నా ఏం చేయ‌లేం. ప్ర‌తిసారీ రాజ‌కీయం చేయాలన్న ఆలోచన నుంచి పార్టీలు బ‌య‌ట‌కు వ‌స్తే మంచి స‌మాజ నిర్మాణం సాధ్యం. నేను ఇలా ఆశించిన ప్ర‌తిసారీ భంగ‌పాటే మిగిలింది. అయినా ఆనంద‌బాబు, చంద్ర‌బాబు ఇంకా ఇంకొంద‌రు ఆలోచించండి. మీ వంతుగా ఈ హ‌త్యాకాండ‌ను నిలువ‌రించేందుకు ఏం చేయాలో చెప్పండి చాలు..ఇక స్ధానికులూ ఇప్పుడు మీ కొవ్వొత్తి వెలుగులు మా కొద్దు కానీ కాస్త‌యినా ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో చొర‌వ చూపితే అభాగ్యుల ప్రాణాలు దక్కుతాయి. మ‌నుషుల్లో మేల్కొ ల్పు కోరుకోవ‌డం నుం చి మ‌నిషి మేల్కొల్పున‌కు కార‌ణం అవ్వ‌డం వ‌ర‌కూ అన్నింటా కూడా ఓ ఆశారేఖ వెన్నాడి ఉంటుంది. ఐ నెవ‌ర్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ హో ప్ రే.. చిన్నారి ర‌మ్య‌కు నివాళి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: