వ‌ర‌ల్ట్ ఎలిఫెంట్ డే : అక్క‌డ మ‌నుషులు, ఏనుగులు క‌లిసే జివిస్తాయ‌ట.!

Paloji Vinay
ప్ర‌కృతిలో ఏ జివి అయిన బ‌తికే హ‌క్కు ఉంటుంది. జంతువులు, మ‌నుషులు అనే తేడా లేకుండా అన్నింటికీ ఈ భూమి అవాసం క‌ల్పిస్తోంది. ఒక‌ప్పుడు అడ‌వులు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల జంతువులు జ‌నార‌ణ్యంలోకి వ‌చ్చేవి కాదు. అభివృద్ది పేరుతో జ‌నాభ రేటు పెరుగుద‌ల‌తో జంతువుల అవాసాలను మ‌నుషులు ధ్వంసం చేస్తున్నారు. దీంతో అడ‌వి జంతువులు మనుషుల మ‌ధ్య‌కు వ‌స్తున్నాయి.. కాదు కాదు జ‌నాలే జంతువులు ఉండే ప‌రిస‌రాల‌ను క‌బ్జా చేసేస్తున్నారు. అడ‌వి జంతువులు ఊర్ల‌ల్లోకి వ‌స్తున్న విష‌యాలు మ‌నం చూస్తూనే ఉన్నాం.
   
   త‌మిళ‌నాడులోని నీల‌గిరి జిల్లా గుడ‌లూరులో ఓ ఏనుగు నిత్య ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉండేది. వారు పెట్టిన ఆహారం తీసుకునేది. రోడ్డు ప‌క్క‌నే ప‌డుకునేది, అటుగా వెళ్లిన వాహనాల్లోని పండ్ల‌ను, ఆహారాన్ని త‌న తొండంతో అడిగి తీసుకునేది. అడ‌వుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ప్ర‌దేశాల‌కు నీళ్ల కోసం, ఆహారం కోసం చాలా ప్రాంతాల్లో గ‌జ‌రాజులు ఊర్ల‌ళ్లోకి వ‌స్తుంటాయి. అవి మ‌నుషుల‌తో క‌లిసి జీవించ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నాయి. గుడ‌లూరు చుట్టు ప‌క్క‌న ఉన్న అడ‌విలో సుమారు 150 ఏనుగులు ఉంటాయి. వాటిలో కొన్ని ప‌ట్టణాల్లోకి రావ‌డం అల‌వాటు చేసుకున్నాయి.

   అయితే, గ‌ణేష‌న్ పేరు పెట్టిన ఓ ఏనుగును మూడేళ్ల‌పాటు ట్రాక్ చేయ‌గా అది ఒక్క‌సారి కూడా అడ‌విలోకి వెళ్ల‌లేద‌ని తేలింది. ఆ ఏనుగుల్లో అన్ని ముస‌లి ఏనుగులే ఉన్నాయి. వాటికి నీరు, ఆహారం సుల‌భంగా సంపాదించ‌డం కోసం జ‌నావాసాల్లోకి వ‌స్తున్న‌ట్టు తెలిసింది. త‌ర్ష్ అనే ఏనుగుల ప‌రిశోధ‌కుడి అంచ‌నా ప్ర‌కారం భార‌త‌దేశంలో సుమారు 20 ఏనుగులు ఇలా ప‌ట్ట‌ణాల్లో నివ‌సిస్తున్నాయి. అయితే ఏనుగులు మ‌నుషుల మ‌ధ్య ఎలా జివిస్తున్నాయో తాము కూడా ఆ విధంగా మారాల‌ని స్థానికులు గ్ర‌హించారు.

 అలాగే ఊటీలో ఓ రివాల్టో అనే ఏనుగు మ‌నుషుల‌తో క‌లిసి జీవిస్తుంటుంది. ఒక సారి ఓ వ్య‌క్తి త‌న‌కు ప‌న‌స పండు ఇవ్వ‌డంతో అది అక్క‌డికి రావ‌డం అల‌వాటు చేసుకుంది. ఎన్ని సార్లు అట‌వీ అధికారులు దాన్ని అడ‌విలోకి విడిచిపెట్టినా తిరిగి మ‌ళ్లి ప‌ట్ట‌ణంలోకే వ‌చ్చేది. ఒక సారి అడ‌విలో విడిచిపెట్టిన త‌రువాత దాదాపు 40 కిలోమీట‌ర్ల దూరాన్ని 24 గంట‌ల్లో చేరుకుని ప‌ట్ట‌ణానికి వ‌చ్చింది. ఏనుగు వ‌ల్ల టూరిస్టుల సంఖ్య కూడా పెరుగుతుంద‌ని అక్క‌డి వాళ్లు ఆలోచించి రివాల్టోకు ఆహారం పెట్ట‌డం మొద‌లు పెట్టారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: