హెరాల్డ్ సెటైర్ : ఇంతకీ జగన్ దేనికి భయపడుతున్నాడబ్బా ?

Vijaya
రాష్ట్రప్రజలకు ఈ విషయంలోనే క్లారిటీ రావటంలేదు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయాలని అనుకోవటమే మహాపాపం అయిపోయినట్లుంది. ఎందుకంటే జగన్ ఈనెల 14వ తేదీన ప్రచారానికి రాబోతున్నాడని అనుకున్నారు. అయితే చివరకు రద్దయ్యిందన్నది వేరే విషయం. ప్రచారానికి వస్తున్నడని తెలియగానే తమను చూసే భయపడి ప్రచారానికి వస్తున్నట్లుగా ఒకవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ నేతలు పోటీలుపడి మరీ ప్రకటనలు చేశారు. మొదటగా ఇలాంటి పనికిమాలిన ప్రచారాన్ని మొదలుపెట్టిందే టీడీపీ నేతలు. జగన్ బహిరంగసభలో పాల్గొనబోతున్నాడనగానే టీడీపీ నేతలు గోల మొదలుపెట్టేశారు. ఉపఎన్నికలో ప్రచారానికి జగన్ రాబోతుండటమే తమపార్టీకి నైతిక విజయం వచ్చేసినట్లని తమ్ముళ్ళు ఊదరగొట్టేశారు.ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి గెలుపు కష్టమని ఇంటెలిజెన్స్ సమాచారం అందిందట. దాంతో జగన్లో వణుకు మొదలైపోయి వెంటనే చేస్తున్న భోజనాన్ని కూడా మధ్యలోనే వదిలిపెట్టేసి గదిలోకి వెళిపోయాడట. తాను తిరుపతిలో ప్రచారం చేయకపోతే వైసీపీ ఓడిపోతుందని గన్ షాట్ గా అర్ధమైపోయి జగన్ 14వ తేదీన తిరుపతికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయాడన్నట్లుగా తమ్ముళ్ళు నానా రచ్చ చేశారు. ఇక బీజేపీ నేతల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. తమ పార్టీ అంటేనే జగన్ వణికిపోతున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రజల్లో తమపార్టీ అభ్యర్ధికి వస్తున్న ఆధరణ, పెరుగుతున్న క్రేజును చూసిన తర్వాతే అర్జంటుగా ప్రచారంలోకి దిగకపోతే కష్టమని జగన్ నిర్ణయించుకున్నట్లుగా కమలనాదులు చెప్పుకున్నారు.రెండుపార్టీల నేతలు తమ నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీయేమో పరువుకోసం పాకులాడుతున్నపార్టీ. బీజేపీయేమో డిపాజిట్ అయినా వస్తుందో లేదో తెలీక టెన్షన్ పడుతున్నపార్టీ. ఈ రెండు పార్టీలు కలిసి తమను చూసి జగన్ వణికిపోతున్నాడంటే వణికిపోతున్నాడని పోటీలు పడిమరీ రెచ్చిపోతున్నారు. తమ పార్టీ ఎక్కడ గెలిచిపోతుందో అన్న భయంతోనే చివరకు జనసేన అధినేత పవన్ కల్యాన్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు ఎక్సట్రా షోలకు కూడా ప్రభుత్వం అనుమతించలేదని బీజేపీ నేత సునీల్ ధియోధర్ ఆరోపించటమే విచిత్రంగా ఉంది. ఇంతకన్నా విచిత్రమేమిటంటే పవన్ సినిమా ఎక్సట్రా షోలకు ప్రభుత్వం ఎందుకడ్డుకుందని చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీస్తుండటమే పెద్ద జోక్. మరి చివరినిముషంలో పర్యటనను జగన్ రద్దు చేసుకున్నందుకు కూడా ఏమన్నా భాష్యాలు చెబుతాయోమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: