హెరాల్డ్ సెటైర్:జగన్ కు చంద్రబాబు అనుభవమే ఎదురవుతుందా...?

Gullapally Venkatesh
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలో వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. కొన్ని వర్గ విభేదాలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూసీచూడనట్టుగా ముందుకు వెళ్లడం కూడా పార్టీలో కొన్ని సమస్యలకు దారితీస్తుంది అని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మధ్యకాలంలో కొంతమందికి దూరంగా ఉంటున్నారు. పార్టీకోసం కష్ట పడిన వారిని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు అనే భావన కూడా ఉంది.
దీనితో పార్టీలో విభేదాలు కూడా పెరుగుతున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మాట విని కొంత మందిని పక్కన పడడంతో సమస్యల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇక వైసీపీ నేతల్లో విభేదాలు ఉండటంతో కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేకపోవడంతో  నియోజకవర్గంలో సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి.
ఒక పక్కన మంత్రులు కారణంగా ఎంపీలు కూడా ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించడంతో కొన్ని కొన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితి కాస్త ఇబ్బందిగా తయారవుతుంది. కొంతమంది మాట వినడం లేదు అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ బలంగా ఉండటంతో ఏది చేసినా సరే ఇప్పుడు వైసీపీ నేతలు చెల్లుతుంది అనే భావనలో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ఉన్న ప్రజాదరణ తమను ఇబ్బంది పెట్టే అవకాశం లేదు అనే భావనలో కూడా కొంతమంది ఉన్నారు. అయితే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విషయంలో ఇలాగే ఊహించుకున్నారు చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా 175 నియోజకవర్గాల్లో నా మొహం చూసి ఓటు వేయండి అన్నారు.  ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: