సెటైర్:బాబుకి చాలా ఛాన్స్ లు ఇచ్చిన జగన్...? కాని అదే పట్టుకుని వేలాడుతూ...?
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించి ఇరుకునబెట్టి రాజకీయం చేసి దాని ద్వారా లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది పెద్దగా ఫలించే అవకాశం ఉండదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు ప్రత్యేక హోదా గురించి సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు చేస్తున్నారు. దీనివలన ముఖ్యమంత్రి జగన్ కు గాని ఆ పార్టీకి గాని వచ్చిన నష్టం అంటూ ఏమీ లేదనే విషయం చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు అధికార పార్టీ నేతల విషయంలో తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. రాష్ట్రంలో ప్రజలు నిత్యావసర సరుకుల ధరలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసుకుంటే మంచిది అనే భావన చాలా మందిలో ఉంది. అంతే కాకుండా రాష్ట్రంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు రాష్ట్రప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు దీని వలన కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ది పొందాల్సిన అవసరం ఉంటుంది.