సెటైర్:వైసీపీకి తక్కువ మెజారిటీ రావాలని బీజేపి కోరుతుందా...?

Gullapally Venkatesh
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా తీసుకునే అవకాశాలు దాదాపుగా లేకపోవచ్చు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ముఖ్యమంత్రి జగన్ కు ప్రజల్లో సానుకూలత ఎక్కువగా ఉంది అనే వ్యాఖ్యలు కొందరు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మీద బీజేపి  నేతలు దృష్టి పెట్టారని సమాచారం. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా ఫర్వాలేదు కానీ అధికార వైసీపీకి మెజార్టీ తక్కువ రావాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్ ను భారతీయ జనతా పార్టీ పెద్దలు దూరం చేసుకునే ఆలోచనలో ఉన్నారు అనే వ్యాఖ్యలు కూడా గత కొన్ని రోజులుగా వినపడుతున్నాయి.
రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గింది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. రాష్ట్రంలో కొన్ని కొన్ని విషయాల్లో భారతీయ జనతాపార్టీ ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తో కలిసి బీజేపీ ముందుకు వెళ్లడం సాధ్యం అయ్యేపని కాదు. తెలుగుదేశం పార్టీని దగ్గర చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏంటనేది తెలియకపోయినా తెలుగుదేశం పార్టీ వలన కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో బీజేపీ పెద్దలకు కొన్ని అవసరాలు ఉన్నాయని అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ విషయంలో కాస్త కీలక నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: