హెరాల్డ్ సెటైర్:భారాన్ని దించుకునే ఆలోచనలో సోనియమ్మ...!

Gullapally Venkatesh
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు మార్పులు చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలావరకు దారుణంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికి ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తెలంగాణలో భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం కూడా లేవని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ మధ్యే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ ఏ విధంగా ముందుకు వెళుతుంది ఏంటనేది అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు కొన్ని కొన్ని కీలక మార్పులు చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆరు జిల్లాల పరిధిలో జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలలో చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేయలేకపోయారు. రేవంత్ రెడ్డిపై కూడా కాస్త ప్రభావం పడిందని చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలను పార్టీ నుంచి పంపడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర పార్టీ నేతలతో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత సోనియా గాంధీ స్వయంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని ఆయన అడుగులు వేసే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే నాయకత్వంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: