తెలుగుదేశంపార్టీలో కొందరు నేతలకు జైలుకెళ్ళటమంటే మహా సరదగా ఉన్నట్లుంది. నోటికొచ్చినట్లు మాట్లాడేయటం, చేతలకు పనిచెప్పటం, ప్రధానంగా పోలీసులతో చాలా దురుసుగా ప్రవర్తించటం లాంటి చర్యలతో కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కేసులు అవుతున్న కారణంగా చివరకు జైలుకు వెళ్ళాల్సొస్తోంది. తాజాగా మాజీమంత్రి కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొందరలోనే కోర్టులో ప్రవేశపెట్టడం, తర్వాత కోర్టు రిమాండ్ కు పంపటం ఖాయం. అనుమతి లేకపోయినా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ఓ పోలింగ్ బూత్ లోకి కొల్లు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దాన్ని అడ్డుకున్న పోలీసులతో అక్కడే కొల్లు గొడవపడ్డారు. గొడవపడటమే కాకుండా అడ్డుకున్న ఎస్ఐని వెనక్కు తోసేశారు. తనను చంపుతావా ? చంపేయ్, చంపేయ్ అంటూ ఎస్ఐతో గొడవకు దిగటం విచిత్రంగా ఉంది.
తానే ఎస్ఐతో గొడవకు దిగి ఉల్టాగా తనపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ పోలింగ్ బూత్ ముందే బైఠాయించటం, పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తతలు సృష్టించటంతో చివరకు పోలీసులు కేసు నమోదు చేసి కొల్లును అరెస్టు చేశారు. కొల్లు యవ్వారం చూస్తుంటే కావాలనే పోలీసులను రెచ్చగొట్టి కేసు నమోదు చేసేట్లుగా వ్యవహరించి చివరకు అరెస్టు అయినట్లుంది. రెండు రోజుల క్రితమే తాడిపత్రిలో మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులతో ఇలాగే వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న జేసీ పోలీసు వాహనానికి దారి ఇవ్వకుండా చాలాసేపు సతాయించారు. తర్వాత దారి ఇచ్చిన తన మద్దతుదారుడినే బండబూతులు తిట్టటమే కాకుండా పోలీసులను కూడా అమ్మనాబూతులు తిట్టారు. పోలీసులను ధూషించిన కారణంగానే మూడుసార్లు అరెస్టయ్యారు.
అంతకుముందు మరో మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఇలాగే వ్యవహరించారు. పోలీసులను నోటికొచ్చినట్టు తిట్టడం, బెదిరించటం, వాళ్ళతో గొడవలు పెట్టుకోవటం లాంటివి చాలా సహజమైపోతున్నాయి. ఈ కారణంతోనే అచ్చెన్న ఇప్పటికే రెండుసార్లు అరెస్టయ్యారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామన్న విషయం మరచిపోతున్న టీడీపీ నేతలు నేరుగా పోలీసు అధికారులతోనే గొడవలకు దిగుతున్నారు. అధికారంలో ఎవరుంటే వారు చెప్పినట్లుగా పోలీసులు వింటారన్న కనీస ఇంగితం కూడా టీడీపీ నేతల్లో లోపించింది. తాము అధికారంలో ఉన్నపుడు వైసీపీ నేతలపై పోలీసులను ఇలాగే ఉసిగొల్పిన విషయాన్ని మరచిపోయినట్లున్నారు. వైసీపీ ఎంఎల్ఏలు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, రోజా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి లాంటి అనేకమంది అప్పట్లో పోలీసుల వల్ల ఇబ్బందులు పడినవారే. కాబట్టి టీడీపీ నేతల వరస చూస్తుంటే అరెస్టవ్వటమంటే మహా సరదగా ఉన్నట్లుంది.