హెరాల్డ్ సెటైర్ : గెలుపు కోసం ఎల్లోమీడియా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగేసిందా ?

Vijaya
మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని గెలిపించటం కోసం చివరకు ఎల్లోమీడియా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగుకు కూడా దిగేసింది. మొత్తం మున్సిపాలిటిల్లో, కార్పొరేషన్లలో టీడీపీని గెలిపించటం సాధ్యం కాదని అర్ధమైపోయింది. అందుకనే ప్రత్యేకంగా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల మీద మాత్రమే ఎల్లోమీడియా దృష్టిపెట్టింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే పై రెండు కార్పొరేషన్ల ప్రచారంలో చంద్రబాబునాయుడు రాజధాని అమరావతి అంశంపై ఒకటికి వందసార్లు మాట్లాడుతున్నారు. జనాలను రెచ్చగొడుతున్నారు. అయితే చంద్రబాబు పాచిక పారదని ముందే గ్రహించిందో ఏమో ఎల్లోమీడియా. అందుకనే తానే నేరుగా రంగంలోకి దిగేసింది.




ఒకవైపు జనాలను చంద్రబాబు రెచ్చగొడుతున్న సమయంలోనే మరోవైపు అమరావతి ఉద్యమం పేరుతో దీక్షలు చేస్తున్న మహిళలను రెచ్చగొట్టి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ దర్శనానికి పంపిందట. అదికూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పేరుతో దుర్గాలయానికి దర్శనం కోసం వెళ్ళటంలో ఏమిటర్ధం ? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏమన్నా పడుగ రోజా ? దసరా, దీపావళి, సంక్రాంతి లేదా వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో గుళ్ళకెళ్ళారంటే అర్ధముంది. ఎప్పుడైతే మహిళలు పెద్దఎత్తున దుర్గ గుడికి చేరుకున్నారో పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. గుడికి వచ్చిన మహిళలు భక్తురాళ్ళుగా కాకుండా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన రూపంలో అక్కడికి చేరుకోవటమే సమస్యయ్యింది.




అసలే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దానికితోడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున చేరుకోవటంతో గొడవ మొదలైంది. దాంతో పోలీసులకు మహిళలకు మధ్య తోపులాటలు మొదలై చివరకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సొచ్చింది. ఇదంతా కావాలనే టీడీపీ+ఎల్లోమీడియా వ్యూహాత్మకంగా చేసిన పథకమని తేలిపోయింది. ఎందుకింత వ్యూహం పన్నారంటే పోలింగ్ ముందు ఇలాంటి పనికిమాలిన వ్యూహాలు పన్ని జనాల్లో సెంటిమెంటును రగల్చటమే అసలు ఉద్దేశ్యంగా కనబడుతోంది. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో టీడీపీని గెలిపించటమే టార్గెట్ గా ఎల్లోమీడియా వేసిన పథకంగా ప్రచారం జరుగుతోంది. మరి జనాలు ఈ పథకాలకు, ఎమోషన్ల బ్లాక్ మెయిలింగ్ కు లొంగిపోతారా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: