అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని గత ఏడాది కాలంగా నిర్విరామంగా ఉద్యమం చేస్తున్నారు. అయినప్పటికీ జగనోరు ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పటికీ 400 రోజులకు చేరింది. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు నిర్విరామంగా ఉద్యమంలో పాల్గొంటూ 'ఒకటే రాష్ట్రం-ఒకటే రాజధాని’ నినాదంతో అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అసలు ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల ప్రతిపాదనను జగనోరు ఎందుకు తీసుకొచ్చారు.? అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో అభివృద్ధి కన్నా కక్ష సాధింపు చర్యనే అధికంగా ఉంది అంటూ బహిరంగంగానే పలువురు తమ వాదనను వినిపిస్తున్నారు.